అక్షరటుడే, వెబ్‌డెస్క్ : 15 Maoists Surrender | మావోయిస్టుల లొంగుబాట కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్తో బలగాలు చొచ్చుకు వస్తుండటం, ఎన్కౌంటర్లలో అనేక మంది హతం అవుతుండటంతో నక్సల్స్ ఆయుధాలు వీడుతున్నారు.
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో తాజాగా 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు (15 Maoists Surrender). మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ దేవ్‌జీ, కీలక నేతలు రాజిరెడ్డి, చొక్కారావు తదితరులు ఇటీవల లొంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో వీరి బాటలోనే చాలా మంది సరెండర్ కావడానికి సిద్ధం అవుతున్నారు. తెలంగాణకు చెందిన అనేక మంది కీలక నేతలు ఇప్పటికే లొంగిపోగా.. పలువురు అడవుల్లో ఉన్నారు. వారిలో తాజాగా ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ లొంగిపోయారు.
15 Maoists Surrender | ఒడిశా కార్యదర్శిగా..
వరంగల్ (Warangal) జిల్లా తరాలపల్లికి చెందిన సాంబయ్య (Sambaiah) ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. శనివారం ఆయన తన 15 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఆదివారం అధికారులు వివరాలు వెల్లడించారు. బలంగీర్-బార్‌ఘర్-మహాసముంద్ (BBM) డివిజన్‌కు చెందిన 15 మంది మావోయిస్టు కార్యకర్తలు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. వీరిలో వికాష్ (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు), దినేష్, కవిత, సవిత, మంగేష్, రింకు, జుగ్ను, అస్మిత, సస్మిత, సాస్మిత తదితరులు ఉన్నారు. ఇందులో ఇద్దరు డివిజన్ కమిటీ సభ్యులు కాగా, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఏడుగురు ప్లాటూన్ సభ్యులు ఉన్నారు.
15 Maoists Surrender | ఆయుధాల అప్పగింత
లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు తమ ఆయుధాలు అప్పగించారు. మూడు AK-47 రైఫిల్స్, రెండు SLRలు, మూడు 303 రైఫిల్స్, మూడు 12-బోర్ గన్లు, రెండు INSAS రైఫిల్స్, ఒక 14 మస్కెట్ (మ్యాగజైన్ లేని 303 రైఫిల్) అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్ట్‌ల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు కేంద్రం ఆపరేషన్ కగార్ పేరిట తరముతోంది. దీంతో మావోయిస్టులు అడవులను వీడుతున్నారు. ఈ నెల 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది. గడువు సమీపిస్తుండటంతో బలగాలు అడవుల్లో ఉన్న మావోల కోసం వేట కొనసాగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి

