Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: 2 BHK Shops Auction | డబుల్​ బెడ్​ రూమ్​ కాలనీల్లో దుకాణాలకు వేలం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - 2 BHK Shops Auction | డబుల్​ బెడ్​ రూమ్​ కాలనీల్లో దుకాణాలకు వేలం

హైదరాబాద్తెలంగాణ

2 BHK Shops Auction | డబుల్​ బెడ్​ రూమ్​ కాలనీల్లో దుకాణాలకు వేలం

జీహెచ్​ఎంసీ పరిధిలోని డబుల్ బెడ్​ రూమ్​ హౌసింగ్ కాలనీలలో ఉన్న 1,400కు పైగా దుకాణాల వేలం ప్రక్రియ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 7:07 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
2 BHK Shops Auction

అక్షరటుడే, వెబ్​డెస్క్ : 2 BHK Shops Auction | జీహెచ్​ఎంసీ (GHMC) పరిధిలోని డబుల్ బెడ్​ రూమ్​ హౌసింగ్ కాలనీలలో ఉన్న 1,400కు పైగా దుకాణాల వేలం ప్రక్రియ ఏప్రిల్ 9 (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 36 కాలనీల్లో ఉన్న దుకాణాలకు పలు దశల్లో వేలం నిర్వహించనున్నారు.

Contents
  • 2 BHK Shops Auction | కాలనీల అభివృద్ధికి..
    • 2 BHK Shops Auction | వేలం షెడ్యూల్

వేలంపాట కోసం కలెక్టర్లు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశారు. మొదటి దశలో రంగారెడ్డి జిల్లాలోని 8 కాలనీలలోని 273 దుకాణాలకు ఏప్రిల్ 9, 10 తేదీలలో వేలంపాట నిర్వహించనున్నారు. ఆయా కాలనీల్లో ప్రజల అవసరాలను తీర్చడానికి, స్థానిక వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించడానికి 60 నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో దుకాణాలను నిర్మించారు. ఆసక్తి గల బిడ్డర్లు ఉదయం 11 గంటలలోపు సంబంధిత ఆర్డీవో కార్యాలయంలో అవసరమైన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) సమర్పించి వేలం కోసం నమోదు చేసుకోవచ్చు.

2 BHK Shops Auction | కాలనీల అభివృద్ధికి..

ఈ దుకాణాల వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా కాలనీల అభివృద్ధి, నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఈ నిధులను ఉమ్మడి ఖాతాల ద్వారా నిర్వహించడానికి, సహకార సంఘాల చట్టం కింద నివాసితుల సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్పస్ ఫండ్‌గా నిర్వహిస్తారు. దాని ద్వారా వచ్చే ఆదాయం, నివాసితుల నుంచి వచ్చే నెలవారీ నిర్వహణ ఖర్చులను లైటింగ్, లిఫ్టులు, బోర్‌వెల్స్ వంటి ఉమ్మడి ప్రాంతాల నిర్వహణ కోసం వినియోగిస్తారు.

2 BHK Shops Auction | వేలం షెడ్యూల్

ఏప్రిల్ 9, 10 తేదీల్లో రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని 8 కాలనీల్లో , 273 దుకాణాలకు వేలం వేస్తారు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో హైదరాబాద్ జిల్లాలో గల 10 కాలనీల్లో ఉన్న 77 దుకాణాలకు, 15 నుంచి17 తేదీల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని 12 కాలనీల్లో 892 దుకాణాలకు వేలం పాట నిర్వహిస్తారు. ఏప్రిల్ 15 నుంచి 18, 21తేదీల్లో సంగారెడ్డి జిల్లాలో గల 6 కాలనీలు, 372 దుకాణాలను వేలం వేస్తామని అధికారులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Illegal Water Motors | నల్లాకు మోటార్​ పెడుతున్నారా.. జలమండలి కఠిన చర్యలు

Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​!
Delhi Liquor Case Relief | ఢిల్లీ లిక్కర్​ కేసు.. కేజ్రీవాల్‌, కవితకు బిగ్​ రిలీఫ్
Food Adulteration Warning | ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి రాజనర్సింహ వార్నింగ్​
Hyderabad traffic restrictions | హైదరాబాద్​లో రేపు ట్రాఫిక్​ ఆంక్షలు
Musi River Cleanup | మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం : సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:2 BHK shops auctionGHMC auctiongovernment auctions IndiaHyderabad housing schemeretail shop spaces
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Midwifery Training Midwifery Training | ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్​వైఫరీ ట్రైనింగ్ : మంత్రి రాజనర్సింహ
Next Article Farmers Trade Deal Issue | Farmers Trade Deal Issue | రైతులకు అన్యాయం చేస్తూ విదేశాలతో కేంద్రం ఒప్పందాలు: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?