Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Rally | తగ్గుతున్న యుద్ధ భయాలు.. పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Rally | తగ్గుతున్న యుద్ధ భయాలు.. పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Rally | తగ్గుతున్న యుద్ధ భయాలు.. పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియలో యుద్ధ భయాలు తగ్గే సూచనలు కనిపిస్తుండడంతో స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ 1,205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు పెరిగాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 4:37 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Stock Market Rally

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Rally | అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ దిశగా అడుగులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా అందిస్తున్న రిపోర్ట్‌లు ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ (Crude oil) ధర దిగివస్తుండడం, డాలర్, బాండ్ ఈల్డ్స్ తగ్గడం వంటి కారణాలతో ఈక్విటీ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి.

Contents
  • Stock Market Rally | రోజంతా లాభాల్లోనే..
    • Stock Market Rally | అన్ని ఇండెక్స్‌లు గ్రీన్‌లోనే..
      • Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

Stock Market Rally | రోజంతా లాభాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) బుధవారం రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఉదయం సెన్సెక్స్ 584 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో 102 పాయింట్లు తగ్గింది. తర్వాత పుంజుకుని 1,299 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 152 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 402 పాయింట్లు పెరిగింది. చివరి గంటన్నరలో ప్రాఫిట్ బుకింగ్‌తో లాభాలు కాస్త తగ్గాయి. చివరికి సెన్సెక్స్ (Sensex) 1,205 పాయింట్ల లాభంతో 75,273 వద్ద, నిఫ్టీ 394 పాయింట్ల లాభంతో 23,306 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | అన్ని ఇండెక్స్‌లు గ్రీన్‌లోనే..

అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 3.28 శాతం లాభంతో ఉండగా.. మెటల్, క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పెరిగాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,959 కంపెనీలు లాభపడగా 1,357 స్టాక్స్ నష్టపోయాయి. 156 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 67 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 245 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 8.7 లక్షల కోట్ల మేర పెరిగింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 26 కంపెనీలు లాభాలతో, 4 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 4.39 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.82 శాతం, ఎల్‌టీ 3.80 శాతం, టైటాన్ 3.50 శాతం, ఇండిగో 3.46 శాతం లాభపడ్డాయి.

Losers : టెక్ మహీంద్రా 1.66 శాతం, పవర్‌గ్రిడ్ 1.37 శాతం, టీసీఎస్ 0.86 శాతం, బీఈఎల్ 0.27 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన

iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..
March 16 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్​లో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
TAGGED:equity marketfinancial marketsIndian Stock Marketmarket gains indiaNifty TodaySensex Todayshare market newsstock market rally
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kavitha New Party Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్​..
Next Article Surender Birthday Celebrations Surender Birthday Celebrations | ఘనంగా మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ జన్మదిన వేడుకలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?