అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sudarshan Reddy Polytechnic Initiative | ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)తో కలిసి బుధవారం ఆయన నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు.
Sudarshan Reddy Polytechnic Initiative | ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించేందుకు..
యువతకు తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలనే తపనతో జిల్లాలో విరివిగా పాలిటెక్నిక్ కాలేజీ (Polytechnic College)లను ఏర్పాటు చేయడం జరిగిందని సుదర్శన్ రెడ్డి అన్నారు. అయితే విద్యార్థులు తగిన విధంగా ప్రవేశాలు పొందడం లేదని, ఈ కళాశాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. గడిచిన నాలుగేళ్లలో పాలిటెక్నిక్ కోర్సులు చేసిన అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నవీపేట కళాశాల (Navipet College)లో సివిల్, మెకానికల్ విభాగాలు కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, యువత వినియోగించుకోవాలని హితవు పలికారు.
Sudarshan Reddy Polytechnic Initiative | నీటి ఎద్దడి లేకుండా చర్యలు..
ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులను సన్నద్ధం చేశామని ప్రభుత్వ సలహాదారు అన్నారు. ప్రజలు కూడా సకాలంలో మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లిస్తూ సదుపాయాలను మెరుగుపర్చేందుకు సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నామని, కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై నిఘా ఉంచాలని సంబంధిత శాఖలకు సూచించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా లబ్దిదారులకు అవసరమైన తోడ్పాటును అందిస్తున్నామని, ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
Sudarshan Reddy Polytechnic Initiative | ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..
నిజామాబాద్ (Nizamabad), నిర్మల్ జిల్లాలకు కలిపి ఆయిల్ పామ్ ఫాక్టరీని ప్రభుత్వం కేటాయించినందున, అనువైన స్థలం కోసం పరిశీలన జరుపుతున్నామని, ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం సాధ్యమైనంత త్వరగా ఫాక్టరీని ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామని సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, సందీప్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: BLO Absence Issue | బీఎల్వోల గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం

