Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dhannapal Indiramma houses | నిజామాబాద్​లో ఒక్క డబుల్ బెడ్​రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్​పాల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Dhannapal Indiramma houses | నిజామాబాద్​లో ఒక్క డబుల్ బెడ్​రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్​పాల్

నిజామాబాద్

Dhannapal Indiramma houses | నిజామాబాద్​లో ఒక్క డబుల్ బెడ్​రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్​పాల్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా నిర్మించిన డబుల్​ బెడ్​రూం ఇళ్లను ఒక్క లబ్ధిదారుడికి సైతం ఇవ్వలేదని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 5:32 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Dhannapal Indiramma houses

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Dhannapal Indiramma houses | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా నిర్మించిన డబుల్​ బెడ్​రూం ఇళ్లను ఒక్క లబ్ధిదారుడికి సైతం ఇవ్వలేదని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhan Pal Suryanarayana Gupta) అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూంలపై మాట్లాడారు.

Contents
  • Dhannapal Indiramma houses | నగరంలోని నాగారంలో..
    • Dhannapal Indiramma houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో..

Dhannapal Indiramma houses | నగరంలోని నాగారంలో..

ఇందూరులోని (Induru) నాగారం ప్రాంతంలో 396 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి నాలుగున్నరేళ్లు గడిచిందని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు తీసుకున్నారు కానీ ఒక్క ఇల్లు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. ఏళ్లుగా వృథాగా ఉండడంతో ఇళ్ల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయని, పలు వస్తువులు చోరీకి గురయ్యాయని తెలిపారు. అనేకసార్లు మంత్రులకు విన్నపించడంతో మరమ్మతుల కోసం రూ.1.25 కోట్లు విడుదల చేశారని, కానీ ఇళ్లు మాత్రం కేటాయించలేదన్నారు. అనవసరంగా ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. అలాగే కలెక్టరేట్ సమీపంలో 200 డబుల్ బెడ్​రూం ఇళ్లు 80 శాతం పూర్తి చేసుకున్నాయని, మరో రూ.2 కోట్లు మంజూరు చేస్తే పూర్తవుతాయన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో వివిధ దశల్లో ఉన్న మరి కొన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లకు మరో రూ.3 కోట్లు కేటాయిస్తే సుమారుగా వేయి ఇళ్లు పూర్తవుతాయన్నారు.

Dhannapal Indiramma houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో (Indiramma Housing Scheme) భాగంగా స్థలంతో పాటు రూ.5లక్షలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఒకటి కూడా అందించలేదని ధన్​పాల్​ అన్నారు. ఇక రెండో సంవత్సరం స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల అందిస్తామని చెప్పారు. కానీ.. నిజామాబాద్ అర్బన్​లో స్థలం ఉన్న పేదవారు చాలా తక్కువ మంది ఉంటారని, వారు స్థలం కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. కావున ప్రభుత్వ స్థలం చూయించి, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Sudarshan Reddy Polytechnic Initiative | పాలిటెక్నిక్ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

Siddarameshwara Temple Closure | గ్రహణం ఎఫెక్ట్​.. సిద్దరామేశ్వరాలయం మూసివేత
Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు
Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్​ 1 నుంచి రెండో విడత
Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..
Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​
TAGGED:Dhannapaldouble bedroom homeshousing delaysIndiramma HousesMLA statementNizamabad Newstelangana housing schemeurban development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sudarshan Reddy Polytechnic Initiative Sudarshan Reddy Polytechnic Initiative | పాలిటెక్నిక్ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి
Next Article Market Yard Security | Market Yard Security | మార్కెట్​యార్డులో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Market Yard Security | మార్కెట్​యార్డులో శాంతిభద్రతల..
  • పింగుబ్యాకు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?