Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

పాదాల వాపులు, నొప్పులు నడవడానికే కష్టమయ్యేలా చేస్తాయి. మన పాదాల కోసం కేవలం పది నిమిషాలు కేటాయిస్తే చాలు..

Naresh chandan
Last updated: మార్చి 25, 2026 6:05 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Foot Care | రోజంతా మన శరీర బరువును మోస్తూ, మనల్ని అడుగు ముందుకు వేయించే పాదాల ఆరోగ్యాన్ని మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఎక్కువ సేపు నిలబడటం లేదా కూర్చుని పని చేయడం వల్ల వచ్చే పాదాల వాపులు, నొప్పులు భవిష్యత్తులో నడవడానికే కష్టమయ్యేలా చేస్తాయి. జిమ్‌కు వెళ్లి ఒళ్లు వంచే మనం, మన పాదాల కోసం కేవలం పది నిమిషాలు కేటాయిస్తే చాలు.. రక్తప్రసరణ మెరుగుపడటమే కాకుండా కాళ్లు దృఢంగా మారుతాయి.

Contents
  • Foot Care | కూర్చుని చేసే సులభమైన వ్యాయామాలు:
    • Foot Care | నిలబడి చేసే వ్యాయామాలు:

Foot Care | కూర్చుని చేసే సులభమైన వ్యాయామాలు:

పాదాల రొటేషన్: కుర్చీలో నిటారుగా కూర్చుని, ఒక కాలును పైకి లేపి పాదాన్ని గుండ్రంగా తిప్పాలి. ముందుగా క్లాక్‌వైజ్ (సవ్యదిశలో) 10 సార్లు, ఆ తర్వాత యాంటీ-క్లాక్‌వైజ్ 10 సార్లు తిప్పాలి. ఇలా రెండు కాళ్లకు చేయడం వల్ల కండరాలకు మంచి ఉపశమనం లభిస్తుంది.

హీల్ అండ్ టో మూవ్‌మెంట్: కుర్చీలో కూర్చుని కాళ్లను ముందుకు చాచి పాదాలను పైకి, కిందకు ఆడిస్తుండాలి. ఆ తర్వాత కాళ్లను వెనక్కి తెచ్చి వేళ్లపై భారం వేస్తూ మడమలను పైకి లేపాలి. ఇలా 15-20 సార్లు చేస్తే పాదాల వాపులు తగ్గుతాయి.

వేళ్ల వ్యాయామం: నేలపై కూర్చుని కాళ్లను చాచాలి. పాదాల వేళ్లను గట్టిగా బిగించి కొన్ని సెకన్ల పాటు ఉంచి, ఆపై వదలాలి. ఇలా 10-15 సార్లు చేయడం వల్ల పాదాల్లోని చిన్న కండరాలు బలపడతాయి.

Foot Care | నిలబడి చేసే వ్యాయామాలు:

వేళ్లపై నిలబడటం: నిటారుగా నిలబడి నెమ్మదిగా కాలి వేళ్లపై భారం వేస్తూ పైకి లేవాలి. కొద్దిసేపు అలాగే ఉండి మళ్లీ సాధారణ స్థితికి రావాలి. రోజుకు 10-15 సార్లు ఇలా చేస్తే ఎక్కువ సేపు నిలబడే సామర్థ్యం పెరుగుతుంది.

మడమలపై నడక: పాదాల వెనుక భాగం అంటే మడమలపై కొన్ని అడుగులు నడవడానికి ప్రయత్నించండి. మధ్యమధ్యలో సాధారణంగా నడుస్తూ ఇలా 2-3 సార్లు చేయడం వల్ల పాదాల కండరాలు గట్టిపడతాయి.

సింగిల్ లెగ్ బ్యాలెన్స్: ఒంటి కాలిపై కనీసం 10-15 సెకన్ల పాటు నిలబడాలి. ఆ తర్వాత కాలు మార్చి మళ్లీ ప్రయత్నించాలి. ఇది శరీర సమతుల్యతను (Balance) పెంచడమే కాకుండా పాదాలకు మంచి పట్టును ఇస్తుంది.

ఇది కూడా చదవండి: Sunflower Seeds Beauty | సన్‌ఫ్లవర్ గింజలతో ఇలా చేస్తే.. రెట్టింపు అందం సొంతం!

Telangana Heat Wave | మండనున్న ఎండలు
March 21 Horoscope | పాత పెట్టుబడుల ద్వారా లాభాల వర్షం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఇక డోకా లేదు!
March 11 Gold Prices | ఒక్క రోజులోనే రూ.700 ఎగ‌బాకిన బంగారం ధ‌ర‌.. వెండి ఏకంగా రూ.10 వేల హైక్​
Ugadi Festival Significance | తెలుగు వారి కొత్త ఏడాది ‘ఉగాది’.. ఈ పండుగ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
TAGGED:blood circulation tipsfitness tipsfoot care tipsfoot exercisesfoot pain reliefhealthy feetleg pain solutionreduce swelling feet
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Junk Food Cravings | జంక్ ఫుడ్ తింటున్నారా.. అయితే ఈ డేంజర్ బెల్స్ మీకోసమే! Junk Food Cravings | జంక్ ఫుడ్ తింటున్నారా.. అయితే ఈ డేంజర్ బెల్స్ మీకోసమే!
Next Article POCSO Case POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?