Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Amrabad Rehabilitation Support | ‘అమ్రాబాద్’​ నిర్వాసితులకు అండగా ఉంటాం : భట్టి విక్రమార్క
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Amrabad Rehabilitation Support | ‘అమ్రాబాద్’​ నిర్వాసితులకు అండగా ఉంటాం : భట్టి విక్రమార్క

తెలంగాణ

Amrabad Rehabilitation Support | ‘అమ్రాబాద్’​ నిర్వాసితులకు అండగా ఉంటాం : భట్టి విక్రమార్క

అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని గిరిజనులకు అండగా ఉంటామని భట్టి విక్రమార్క తెలిపారు. 14 కుటుంబాలకు బుధవారం చెక్కులు పంపిణీ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 8:18 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Amrabad Rehabilitation Support

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amrabad Rehabilitation Support | అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. రిజర్వ్ పరిధిలోని గ్రామాలకు చెందిన గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించే చర్యలు ప్రారంభించామన్నారు.

Contents
  • Amrabad Rehabilitation Support | సామాజిక పర్యావరణ సంస్కరణ
    • Amrabad Rehabilitation Support | రెండు రకాలుగా పరిహారం

అమ్రాబాద్​ పులుల సంరక్షణ కేంద్రం కోసం పలు గ్రామాలను ఖాళీ చేయిస్తున్న విషయం తెలిసిందే. వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. మొదటి దశలో నాలుగు గ్రామాల నుంచి మొత్తం 417 కుటుంబాలను ఈ పునరావాస పథకం పరిధిలోకి తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 14 గిరిజన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

Amrabad Rehabilitation Support | సామాజిక పర్యావరణ సంస్కరణ

భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అమ్రాబాద్ అడవులలో జీవిస్తున్న గిరిజన సముదాయాల్లో అభివృద్ధిని తీసుకురావడం తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. అదే సమయంలో అటవీ వన్యప్రాణి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక సామాజిక-పర్యావరణ సంస్కరణ అన్నారు. గిరిజన కుటుంబాల స్వచ్ఛంద పునరావాసం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. అలాగే పులులతో సహా ఇతర వన్యప్రాణుల సహజ ఆవాసాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.

Amrabad Rehabilitation Support | రెండు రకాలుగా పరిహారం

మొత్తం ప్రక్రియ గిరిజన కుటుంబాల ఆమోదం మేరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. వారి ఎంపిక మేరకు రెండు రకాల పునరావాస ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. 160 కుటుంబాలకు రూ. 15 లక్షల నగదు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. మరో 257 కుటుంబాలకు నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని బచారంలో ఆధునిక వసతులతో కూడిన ఇళ్లు, 5 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : Double Bedroom Houses | ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి

Nizamabad Railway Projects | రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి: ఎంపీ అర్వింద్​
Kalvakuntla Kavitha arrest | కల్వకుంట్ల కవిత అరెస్ట్​.. జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగింపు
Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
Mother Attack Children | పిల్లలపై కత్తితో దాడి చేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
Ugadi Panchang Predictions | వారికి ఆ నాలుగు నెలలు నరకమే..
TAGGED:amrabad tiger reserveforest relocation indiaTelangana Governmenttribal rehabilitation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Double Bedroom Houses Double Bedroom Houses | ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి
Next Article Kulsum Pura ACP Tirupati Kulsum Pura ACP Tirupati | కుల్సుంపురా ఏసీపీగా తిరుపతి బాధ్యతల స్వీకరణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?