అక్షర టుడే, ఎల్లారెడ్డి: Adoor Congress Campaign | కేరళ రాష్ట్రంలోని అడూర్ నియోజకవర్గానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులుగా వెళ్లారు. నియోజకవర్గ ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. విస్తృత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Adoor Congress Campaign | వ్యూహాత్మక ప్రచారం..
అందులో భాగంగా బుధవారం అడూర్ నియోజకవర్గంలోని ఎరత్, అడూర్, కడంపనాడ్ మండలాల్లో ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించారు. గెలుపు కోసం అవలంబించాల్సిన వ్యూహాలను వారికి ఎమ్మెల్యే వివరించారు.
దిశానిర్దేశం..
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. అడూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

