Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Padma River Bus Accident | ఘోర విషాదం.. పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు 23 మంది దుర్మరణం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Padma River Bus Accident | ఘోర విషాదం.. పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు 23 మంది దుర్మరణం!

అంతర్జాతీయం

Padma River Bus Accident | ఘోర విషాదం.. పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు 23 మంది దుర్మరణం!

బంగ్లాదేశ్‌లోని రాజ్‌బారి జిల్లాలో దౌలత్‌దియా టెర్మినల్ వద్ద బస్సు నేరుగా పద్మా నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 10:27 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
20 గంటలు ago
Share
Padma River Bus Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Padma River Bus Accident | బంగ్లాదేశ్‌ (Bangladesh)లో జ‌రిగిన‌ ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాజ్‌బారి జిల్లా (Rajbari District)లోని దౌలత్‌దియా ఫెర్రీ టెర్మినల్ సమీపంలో సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పద్మా నదిలోకి పడిపోయింది.

Contents
  • Padma River Bus Accident | 23 మృతదేహాలు వెలికితీత
    • Padma River Bus Accident | బంగ్లాదేశ్ ప్రధాని తారీఖ్ రెహ‌మాన్  తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈద్ సెలవులు ముగించుకుని ఢాకాకు తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశం ఢాకా నగరానికి సుమారు 128 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Padma River Bus Accident | 23 మృతదేహాలు వెలికితీత

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు , అగ్నిమాపక దళం, నౌకాదళం సహా పలు రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు 23 మృతదేహాలను వెలికితీసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రస్సెల్ మొల్లా (Police Inspector Russell Molla) తెలిపారు. ఇంకా కొందరు ప్రయాణికులు గల్లంతై ఉండవచ్చని భావిస్తున్నారు.

రాత్రి చీకటి కారణంగా సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేసి, గురువారం ఉదయం మళ్లీ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.

Padma River Bus Accident | బంగ్లాదేశ్ ప్రధాని తారీఖ్ రెహ‌మాన్  తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ అబ్దుల్ అజీజుల్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని వివరిస్తూ.. బస్సు నదిలో పడిన వెంటనే తాను ఈదుకుంటూ బయటకు వచ్చానని తెలిపాడు. అయితే తన భార్య, బిడ్డ ఇంకా కనిపించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారీఖ్ రెహ‌మాన్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని కూడా సూచించారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపగా, రోడ్డు భద్రత, వాహన నియంత్రణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Akshara Today (@aksharatoday)

ఇది కూడా చదవండి..: Iran Currency Collapse | ఏడున్నర డాలర్లుంటే.. అక్కడ కోటీశ్వరులే!

Iran War Ceasefire | యుద్ధం ఆపేస్తాం.. ఇరాన్​ అధ్యక్షుడి సంచలన ప్రకటన
Qatar oil price warning | చమురు ధరలు రెట్టింపు అవుతాయా.. ఖతార్​ సంచలన ప్రకటన
Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
Iran Israel Conflict | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
TAGGED:accident updateBangladeshBangladesh newsbus plunge riverferry terminal crashPadma River Bus AccidentPadma River tragedyPolice Inspector Russell MollaRajbari Districtrescue operationroad accident news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర! March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!
Next Article Telangana Heat Wave Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?