అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Car Accident | కామారెడ్డి పట్టణం (Kamareddy Town)లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చిన ఓ కారు కారణంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
Kamareddy Car Accident | పట్టణంలోని జయ ఆస్పత్రి వద్ద..
పట్టణంలోని జయ ఆస్పత్రి వద్ద బైక్‌లు, ఓ అంబులెన్స్ (Ambulance) పార్కు చేసి ఉన్నాయి. అయితే బస్టాండ్ వైపు నుంచి రాంగ్ రూట్లో ఓ కారు వేగంగా దూసుకువచ్చి పార్కు చేసిన ప్రాంతంలో ఓ అంబులెన్స్, ఆరు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకులు, అంబులెన్సుతో పాటు దూసుకొచ్చిన కారు సైతం ధ్వంసమైంది. ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే కారు డ్రైవర్ మద్యం సేవించి నడువుతున్నాడా.. లేక కారు బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పిందా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్‌పై జీవన్ రెడ్డి ఫైర్!

