Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ

హైదరాబాద్​ నగరంలోని పెట్రోల్​ బంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. కొన్ని చోట్ల నో స్టాక్​ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 11:31 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
19 గంటలు ago
Share
Petrol Bunk Rush Hyderabad

అక్షరటుడే, వెబ్​డెస్క్: Petrol Bunk Rush Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని పెట్రోల్​ బంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. కొన్ని చోట్ల నో స్టాక్​ బోర్డులు దర్శనం ఇస్తుండటంతో భయంతో వాహనదారులు గంటల తరబడి లైన్​లో ఉండి మరి పెట్రోల్​ కొట్టించుకున్నారు.

Contents
  • Petrol Bunk Rush Hyderabad | భయంతో..
    • Petrol Bunk Rush Hyderabad | కొరత లేదు
      • Petrol Bunk Rush Hyderabad | సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు యత్నం

పెట్రోల్​, డీజిల్​ దొరకదని పుకార్లు వ్యాపించాయి. దీంతో బుధవారం నుంచి రాష్ట్రంలో వాహనదారులు పెట్రోల్​ బంక్ (Petrol Pump)​లకు బారులు తీరారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేశారు. కొందరు ట్యాంక్​లు ఫుల్​ చేసుకోగా.. మరికొందరు క్యాన్​లు, డబ్బాల్లో నింపుకొని ఇళ్లకు వెళ్లారు. దీంతో పలు పెట్రోల్​ బంక్​ల్లో స్టాక్​ అయిపోయింది. బుధవారం కిలోమీటర్ల మేర బంక్​ల వద్ద వాహనాలు బారులు తీరాయి. అధికారులు పెట్రోల్​ కొరత లేదని స్పష్టత ఇచ్చారు. వాహనదారులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో గురువారం పరిస్థితి కాస్తా అదుపులోకి వచ్చింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వాహనాల రద్దీ తక్కువగా ఉంది.

Petrol Bunk Rush Hyderabad | భయంతో..

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కనిపిస్తోంది. పెట్రోల్ దొరకదేమోననే భయంతో ముందస్తు జాగ్రత్తగా స్టాక్ ఉంచుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. దీంతో గంటల తరబడి వేచి ఉంటూ తిప్పలు పడుతున్నారు. పెట్రోల్ కొరత లేదని, ఆందోళన వద్దని ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వం తెలిపింది.

Petrol Bunk Rush Hyderabad | కొరత లేదు

హైదరాబాద్​ నగరంలోని పలువురు డీలర్లు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ నిరంతరాయంగా సరఫరా అవుతోందని తెలిపారు. ఇంధన కొరత అస్సలు లేదన్నారు. వదంతులు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. ఇటువంటి తప్పుడు సమాచారం పెట్రోల్ బంకుల వద్ద అనవసరమైన రద్దీకి దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Petrol Bunk Rush Hyderabad | సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు యత్నం

గ్యాస్ ఆటో నుంచి సిలిండర్లు  (Cylinders) ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు యత్నించారు. హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్లతో ఆటో బయటకు వచ్చింది. ఆటోను చూడగానే.. వినియోగదారులు అనుమతి లేకుండా సిలిండర్లు తీసుకొని వెళ్లేందుకు యత్నించారు. స్థానికుల సహాయంతో వారిని ఏజెన్సీ సిబ్బంది అడ్డుకున్నారు. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kulsum Pura ACP Tirupati | కుల్సుంపురా ఏసీపీగా తిరుపతి బాధ్యతల స్వీకరణ

MLA Disqualification Case | అనర్హత కేసు.. ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
MARCH 06 Gold Silver Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో నేటి పరిస్థితి ఏమిటంటే..
India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
SLBC Tunnel Works | ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులు పున:ప్రారంభం
Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్!
TAGGED:Cylindersdiesel supply newsfuel rumors indiaHyderabadhyderabad fuel shortagePetrol Bunk Rush Hyderabadpetrol panic buyingPetrol Pumppetrol queues hyderabad
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Markapuram Bus Accident Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య
Next Article Hormuz Indian Ships Hormuz Indian Ships | ఇరాన్​ గుడ్​న్యూస్​.. హర్ముజ్​ నుంచి భారత నౌకలకు అనుమతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?