Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Balakrishna Lifetime Achievement | బాలకృష్ణకు అంతర్జాతీయ గౌరవం.. ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Balakrishna Lifetime Achievement | బాలకృష్ణకు అంతర్జాతీయ గౌరవం.. ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.

సినిమా

Balakrishna Lifetime Achievement | బాలకృష్ణకు అంతర్జాతీయ గౌరవం.. ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.

ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గాను నందమూరి బాలకృష్ణకు ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ఈ అరుదైన గౌరవంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 12:43 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
13 గంటలు ago
Share
Balakrishna Lifetime Achievement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna Lifetime Achievement | టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. గత 50 ఏళ్లుగా భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయనకు ఢిల్లీలో (Delhi)  జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026 వేడుకల్లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (Lifetime Achievement) అవార్డును అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ పురస్కారం స్వీకరించారు.

Contents
  • Balakrishna Lifetime Achievement | సినీ రంగంతో పాటు రాజ‌కీయ రంగంలోనూ..
    •  Balakrishna Lifetime Achievement | ఆయన సేవలకు గుర్తుగా..

ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ రాజధానిలో ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రోత్సవం ‘భారత్ మండపం’ వేదికగా జరుగుతోంది. ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. వివిధ భాషలకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తూ సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

Balakrishna Lifetime Achievement | సినీ రంగంతో పాటు రాజ‌కీయ రంగంలోనూ..

ఈ కార్యక్రమాన్ని సీఎం రేఖా గుప్తాతో (CM Rekha Gupta) పాటు పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ వేడుకలో హేమ మాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్ పాల్గొన్నారు. అలాగే దివంగత నటుడు ధర్మేంద్రను కూడా జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించడం విశేషం. నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ, తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. డైలాగ్ డెలివరీ, యాక్షన్, మాస్ ఇమేజ్‌తో టాలీవుడ్‌లో (Tollywood) అగ్ర హీరోగా ఎదిగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లకు పైగా కెరీర్ పూర్తి చేయడం ఆయన గొప్ప సాధనగా చెప్పుకోవచ్చు.

 Balakrishna Lifetime Achievement | ఆయన సేవలకు గుర్తుగా..

సినీరంగంతో పాటు ప్రజాసేవలో కూడా బాలకృష్ణ తన ముద్ర వేశారు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. పేదలకు వైద్య సహాయం అందిస్తూ తన సేవాభావాన్ని చాటుతున్నారు. ఆయన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడమే కాకుండా, తెలంగాణ (Telangana) ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, 60 దాటిన వయసులోనూ బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించగా, ఇటీవల వచ్చిన ‘అఖండ 2: తాండవం’ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ‘NBK 111’ చిత్రంలో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు!

The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Allu Sirish Marriage | ప్రేయ‌సితో ఏడ‌డుగులు వేసిన అల్లు శిరీష్‌.. సంద‌డి చేసిన మెగా ఫ్యామిలీ
TAGGED:Balakrishna awardcelebrity newsDelhi film festivalfilm awardsIndian cinemaLifetime Achievementlifetime achievement awardTelugu actorTollywood News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BC Reservation Protest BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన
Next Article Arogyasri Dues Release Arogyasri Dues Release | ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేస్తున్నాం : సీఎం రేవంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?