Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’

తాజా వార్తలుజాతీయం

Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’

పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచుతున్నట్లు నయారా ఎనర్జీ సంస్థ ప్రకటించింది. ముడి చమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 3:13 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
11 గంటలు ago
Share
Nayara Fuel Price Hike

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nayara Fuel Price Hike | దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచుతూ.. నయారా ఎనర్జీ సంస్థ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రైవేట్ చమురు సంస్థ నయారా ఎనర్జీ ఇంధన ధరలను పెంచింది.

Contents
  • Nayara Fuel Price Hike | పెట్రోల్​ కోసం బారులు
    • Nayara Fuel Price Hike | వాటిల్లో పెంపు లేదు

దేశంలో చాలా వరకు పెట్రోల్​ బంక్ (Petrol Pump)​లను ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని బంక్​లను ప్రైవేట్​ సంస్థలు సైతం నిర్వహిస్తున్నాయి. దేశంలో అతి పెద్ద ప్రైవేట్​ ఇంధన రిటైలర్​గా నయారా ఎనర్జీ కొనసాగుతోంది. ఈ సంస్థ తాజాగా పెట్రోల్ ధరలను (Petrol Prices) లీటరుకు రూ.5.30 చొప్పున, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచింది. దేశంలో మొత్తం 1,02,075 పెట్రోల్ బంక్​లు ఉండగా.. 6,967 పంపులను నయారా ఎనర్జీ నిర్వహిస్తుంది. పెరిగిన ముడి చమురు ఖర్చులలో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపాలని నిర్ణయించుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

Nayara Fuel Price Hike | పెట్రోల్​ కోసం బారులు

ఇంధన కొరత ఆందోళనల మధ్య రాష్ట్రాల్లో ప్రజలు తమ వాహనాలకు ఇంధనం నింపుకోవడానికి పెట్రోల్ పంపుల వద్దకు పోటెత్తుతున్నారు. అదే సమయంలో, ఎల్‌పీజీ సంక్షోభం కూడా ఫిల్లింగ్ స్టేషన్లు (Filling Stations) మరియు డిపోల బయట పొడవైన క్యూలకు దారితీసింది. ఈ క్రమంలో నయారా ఎనర్జీ సంస్థ లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్‌ ఆధారంగా రేట్ల పెంపులో స్వల్ప వ్యత్యాసాలు ఉండనున్నాయి. కాగా నయారా ఎనర్జీ సంస్థను రష్యా చమురు సంస్థ అయిన రాస్‌నెఫ్ట్‌ నిర్వహిస్తోంది.

Nayara Fuel Price Hike | వాటిల్లో పెంపు లేదు

దేశంలోని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఐవోసీఎల్, బీపీసీఎల్​, హెచ్​పీసీఎల్ మాత్రం ఇంధన ధరలను పెంచలేదు. అయితే ప్రీమియం పెట్రోల్​ ధరలను మాత్రం లీటర్​కు రూ.2.30 చొప్పున, ఇండస్ట్రియల్‌ డీజిల్‌ను లీటరుకు రూ.22 చొప్పున పెంచాయి. సామాన్యులు వినియోగించే పెట్రోల్​, డీజిల్​ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పెరిగిన ముడి చమురు ధరలను ఆయా కంపెనీలు భరిస్తున్నాయి. మరోవైపు దేశంలో 2,185 ఔట్​లెట్లు ఉన్న రిలయన్స్‌-బీపీ కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పూ చేయలేదు.

ఇది కూడా చదవండి..: BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన

Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!
Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!
Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!
TAGGED:Filling StationsNayara Fuel Price HikePetrol PricesPetrol Pump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Revanth Reddy Comments Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
Next Article School Attendance Improvement School Attendance Improvement | పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలి..: సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Fake ice cream | కల్తీ ఐస్​క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?