అక్షరటుడే, కోటగిరి : School Attendance Improvement | పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) సూచించారు. కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామంలో (Etthonda Village) ఉన్న ఎంపీయూపీఎస్ను గురువారం సందర్శించారు.
School Attendance Improvement | విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..
ఈ సందర్బంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికను సబ్ కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల గైర్హాజరును తగ్గించడంపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 6వ తరగతి విద్యార్థుల ఎండ్ లైన్ పరీక్ష పత్రాలను సమీక్షించారు. విద్యార్థుల చదవడం, రాయడం నైపుణ్యాలను కూడా అంచనా వేసి, ప్రత్యేక కృషి ద్వారా మెరుగుపరచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
School Attendance Improvement | అభ్యసన ఫలితాలను మెరుగుపర్చాలి..
విద్యార్థుల ప్రతిభపై సబ్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీరియడ్ ప్లాన్ ప్రకారం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయ సహాయక బృందం (Teacher Support Group) విద్యార్థులపై అదనపు శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఆయన వెంట తహశీల్దార్ గంగాధర్, ఎంఈవో శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Mission Bhagiratha Salaries | వేతనాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన

