అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Goa liquor smuggling | గోవా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారికి పోలీసులు షాక్ ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) సమీపంలో దాడులు చేపట్టి రూ.2.5 లక్షల విలువైన 127 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగర పోలీసులు ఇటీవల దూకుడు పెంచారు. కల్తీ, అక్రమ దందాపై చర్యలు చేపడుతున్నారు. ఓ వైపు కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మద్యాన్ని సైతం పెద్ద ఎత్తున సీజ్ చేస్తున్నారు. విమానాల ద్వారా గోవా (Goa) నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పహడీ షరీఫ్ వద్ద తనిఖీలు చేపట్టారు.
Goa liquor smuggling | రెండు కేసులు నమోదు
పోలీసులు తనిఖీల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రెండు కేసులు నమోదు చేశారు. వరంగల్‌కు చెందిన మునిగంటి వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసింది. అతడి నుంచి 32 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో 95 సీసాలు సీజ్ చేశారు. మొత్తం 111.5 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.2.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం, నిందితులను మీర్‌పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో మార్పులు

