అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fake ice cream | హైదరాబాద్ (Hyderabad) నగరంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల (Taskforce Police) దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆహార కల్తీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పాల నుంచి మొదలు పెడితే మద్యం వరకు దేనిని వదలకుండా కల్తీ మాఫియా రెచ్చిపోతుంది.
నగరంలో ఇటీవల పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఆహార పదార్థాల కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం తనిఖీలు చేస్తూ.. కల్తీలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. అయితే అవి నకిలీవని తెలియడంతో ఇన్ని రోజులు ఆ ఆహార పదార్థాలు తిన్న వారు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పోలీసులు కల్తీ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్‌పై దాడి చేశారు.
Fake ice cream | గడువు ముగిసిన వాటితో..
ముషీరాబాద్‌లో కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ (Food Safety) అధికారులతో కలిసి గురువారం తనిఖీలు చేపట్టారు. ముషీరాబాద్‌లోని బాపూజీ నగర్లో ఉన్న బ్లూ బెల్స్ ఐస్ క్రీమ్ యూనిట్లో సోదాలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిందితుడు పట్టాల అశోక్ యూనిట్ నడుపుతున్నట్లు గుర్తించారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. గడువు ముగిసిన పదార్థాలను ఐస్‌క్రీమ్ తయారీకి వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Fake ice cream | ఆరోగ్యానికి ముప్పు..
కల్తీ ఐస్‌క్రీమ్‌లను తయారు నిందితుడు అసలువిగా సరఫరా చేస్తున్నాడు. వీటిని తింటే ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని అధికారులు తెలిపారు. కాగా ఐస్ క్రీమ్‌లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వాటిని కూడా కల్తీ మాఫియా వదలడం లేదు. తాజా దాడుల్లో పోలీసులు ఐస్‌క్రీమ్‌లు, గడువు ముగిసిన ఫ్లేవరింగ్ ఏజెంట్లు, కృత్రిమ ఆహార రంగులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.75లక్షలు ఉంటుందని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’

