అక్షరటుడే, వెబ్‌డెస్క్: Record Power Demand | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఎన్పీడీసీఎల్ పరిధిలో గురువారం 6,457 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ రికార్డు నమోదు అయింది.
విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ (TGNPDCL) చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. 6,457 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఇది సంస్థ చరిత్రలోనే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ఎన్పీడీసీఎల్ ఈ నెల 3న 6,441 మెగావాట్ల రికార్డు నెలకొల్పగా.. తాజాగా దానిని అధిగమించింది. ఇది సంస్థ నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనమని సీఎండీ తెలిపారు.
Record Power Demand | ఎండలు మండుతుండటంతో..
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గతం వారం రోజులుగా కాస్త చల్లబడిన వాతావరణం గురువారం మారిపోయింది. ఉష్ణోగ్రతలు (Temperatures) ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఏసీ, కూలర్లు, ఫ్రిజ్‌ల వినియోగం భారీగా పెరిగింది. దీనికి తోడు ప్రస్తుతం వరి పొలాలు ఈనిక దశలో ఉన్నాయి. సాగునీరు అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో వ్యవసాయ బోర్లు నిరంతరయంగా నడుస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.
Record Power Demand | నిరంతర సరఫరా
డిమాండ్ ఎంత పెరిగినా సరే వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తామని సీఎండీ వరుణ్‌రెడ్డి (CMD Varun Reddy) తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఇప్పటికే ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ లైన్లు, సబ్-స్టేషన్లపై నిర్వహణ, ఆధునీకరణ పనులు ముందుగానే పూర్తి చేశామన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Fake ice cream | కల్తీ ఐస్‌క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్

