అక్షరటుడే, కామారెడ్డి : Farmers Compensation | వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) భరోసా ఇచ్చారు. వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన భిక్కనూరు మండలం (Bhikkanur Mandal) కంచర్ల, పెద్దమల్లారెడ్డి గ్రామాల్లో రైతుల పంటలను గురువారం పరిశీలించారు.
Farmers Compensation | పెద్ద మల్లారెడ్డిలో..
పెద్దమల్లారెడ్డి గ్రామంలో చెరువు కింద సుమరి వెయ్యి ఎకరాలు పూర్తిగా నష్టపోయినట్లు రైతులు తెలిపారు. వరిధాన్యంతో పాటు మామిడి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. బాధిత రైతులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో (Revenue Officials) సమావేశమై వెంటనే పంట నష్టం సర్వే చేపట్టి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
Farmers Compensation | రైతులకు న్యాయం జరిగేలా..
రైతులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని షబ్బీర్అలీ సూచించారు. నివేదిక అందిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) మాట్లాడి నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి వారికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలుస్తూ, నష్టపరిహారం త్వరగా అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు సుతారి రమేష్, భీంరెడ్డి, అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత రాజు, డీసీసీ ఉపాధ్యక్షుడు గంపప్రసాద్, ఐరేనీ సందీప్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Pending Works Completion | పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: ఎమ్మెల్యే మదన్మోహన్

