అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Party Positions | కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ(Bobbili Ramakrishna) పేర్కొన్నారు. నూతనంగా నిజామాబాద్(Congress party news) కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులుగా(Nizamabad politics) నియమితులైన సభ్యులకు గురువారం పార్టీ కార్యాలయంలో(DCC Nizamabad) నియామక పత్రాలు అందజేశారు.
Congress Party Positions | పార్టీ కోసం కష్టపడాలి
బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి పదవులు(political appointments) అప్పజెప్పామన్నారు. ఎవరు కూడా పదవిని దుర్వినియోగం చేయకూడదని పార్టీ అభ్యున్నతి కోసం మాత్రమే పాటుపడాలన్నారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడానికి కృషి చేయాలని సూచించారు. కార్యవర్గంలో ఉన్న ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులను నిజామాబాద్ అర్బన్‌లోని పలు డివిజన్లకు ఇన్ఛార్జీలుగా నియమిస్తామన్నారు.
Congress Party Positions | ఆయా డివిజన్లలో సమయం కేటాయించాలి..
ఆయా డివిజన్లలో ఇన్ఛార్జీలుగా నియామకమైన వారు.. ఆ డివిజన్లలో పూర్తి సమయాన్ని కేటాయించాలని రామకృష్ణ సూచించారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు(Indian politics news) పీసీసీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఉంటుందని అందులో పాల్గొనాల్సిందిగా అందరికీ సూచించారు. ఎవరైనా పార్టీ చేస్తున్న కార్యక్రమాలలో(Congress leaders Telangana) పాల్గొనకపోతే తక్షణమే వారిని ఆ పదవి నుంచి తొలగించి వేరే వారిని నియమిస్తామని (party positions India) స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రం హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: IT Expansion | ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి: అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్

