అక్షరటుడే, నిజామాబాద్ క్రైం/ఆర్మూర్: Drunk Driving Penalties | డ్రంకన్ డ్రైవ్లో పలువురికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ(Nizamabad crime news) నిజామాబాద్, ఆర్మూర్ న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి.. ఈ మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ వివరాలు వెల్లడించారు.
Drunk Driving Penalties | నగరంలో..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మస్తాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా.. 13 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా (traffic violations Telangana) గుర్తించారు. వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా.. అతిగా మద్యం సేవించిన ఇద్దరికి వారంరోజుల జైలుశిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ హైమద్ మెయిద్దీన్ తీర్పునిచ్చారు.
అలాగే మరో 11 మందికి ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పు న జరిమానా( drunk driving penalties) విధించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు(Indian traffic rules) తప్పవని ఆయన హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతర ప్రాణాలకు ముప్పు తేవద్దని ఆయన పేర్కొన్నారు.
ఆర్మూర్లో..
ఆర్మూర్ పట్టణంలో (Armoor police) పట్టణంలో తనిఖీలు చేస్తుండగా.. ఏడుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా(crime news Telangana)గుర్తించారు. వారికి కోర్టులో హాజరుపర్చగా ఒక్కొర్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిందని ఎస్హెచ్వో తెలిపారు.
ఇది కూడా చదవండి: Kaleshwaram Package Works | కాళేశ్వరం ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

