అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SI caught bribery | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. ఏసీబీ దాడులు జరుగుతున్న భయపడటం లేదు. కొందరైతే లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. తాజాగా ఓ ఎస్సై లంచం తీసుకుంటూ దొరికాడు.
నిర్మల్ (Nirmal) జిల్లా మామడ పోలీస్ స్టేషన్లో టి అశోక్ ఎస్సైగా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తిపై వచ్చిన ఫిర్యాదులో కేసు నమోదు చేయకుండా ఉండటానికి ఎస్సై రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి ఎస్సై అశోక్ తన క్వార్టర్లో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
SI caught bribery | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : SI Suspension | మిల్స్‌కాలనీ ఎస్సై సస్పెన్షన్

