అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa land seizure | ఆక్రమణలపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతుంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి, చర్యలు చేపడుతోంది. తాజాగా సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్‌చెరు మండలం పాటిఘనాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది.
గ్రామంలో 92 ఎకరాల పరిధిలో వేసిన లే ఔట్‌లో పార్కులతో పాటు రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. స్థలాలు కబ్జా అవుతున్నాయని స్థానికులు సోమవారం హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath), అధికారులతో కలిసి బుధవారం గ్రామంలో పర్యటించారు. ఆక్రమణలు నిజమేనని నిర్ధారించి గురువారం వాటిని తొలగించారు. ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోనే ఆక్రమణలు తొలగించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Hydraa land seizure | ప్రహరీ, షెడ్ల తొలగింపు
పాటిఘనపూర్‌లో 92 ఎకరాల మేర ఆనందనగర్ (Anand Nagar) కాలనీ పేరిట లే ఔట్‌ను 1980లో వేశారు. 1,109 ప్లాట్లతో ఉన్న లే ఔట్‌ను తర్వాత వ్యవసాయ భూమిగా చిత్రించి పాస్‌బుక్‌లు సృష్టించారు. ఆ భూమిని వేరేవాళ్లకు అమ్మకాలు చేపట్టినట్టు హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. లే ఔట్ ప్రకారం రహదారులు, పార్కుల స్థలాలు కబ్జాలైనట్టు గుర్తించారు. పార్కులు, రహదారులు కలిపి మొత్తం 47,840 గజాల మేర ప్రీకాస్ట్ బ్రిక్స్‌తో వేసిన ప్రహరీలతో పాటుషెడ్డులను హైడ్రా అధికారులు గురువారం తొలగించారు. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. రహదారులకు హద్దులు నిర్ధారించారు.
దీనిని కూడా చదవండి : Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

