అక్షరటుడే, హైదరాబాద్: Regional Ring Road Telangana | తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన మౌలిక సదుపాయ ప్రాజెక్ట్ అయిన రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం నిర్మాణంలో కీలక పురోగతి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం అవుతోంది.
Regional Ring Road Telangana | మంత్రి కోమటిరెడ్డికి లేఖ..
ఈ మేరకు కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రాసిన లేఖలో ట్రిపుల్ ఆర్ విషయాన్ని వెల్లడించారు. సదరు లేఖలో ప్రాజెక్టు దక్షిణ భాగం వివరాలు వెల్లడించారు.
దక్షిణ భాగానికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందుకోసం కన్సల్టెన్సీ సంస్థను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది ప్రాజెక్ట్ అమలులో కీలక దశగా అధికారులు భావిస్తున్నారు.
పురోగతిలో ఉత్తర భాగం
ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం టెండర్ దశలో ఉంది. దక్షిణ భాగానికి సంబంధించి కూడా వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో మొత్తం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Geo Spatial Technology India | జియో విద్యార్థులకు NIRDలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు: ప్రొఫెసర్ ఎం.వి. రవిబాబు

