Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Markapur Bus Accident Hero | అంద‌రిని క‌లిచి వేసిన మార్కాపురం బస్సు ప్రమాదం.. 8మందిని కాపాడిన రియ‌ల్ హీరో బాలరాజు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Markapur Bus Accident Hero | అంద‌రిని క‌లిచి వేసిన మార్కాపురం బస్సు ప్రమాదం.. 8మందిని కాపాడిన రియ‌ల్ హీరో బాలరాజు

ఆంధ్రప్రదేశ్​

Markapur Bus Accident Hero | అంద‌రిని క‌లిచి వేసిన మార్కాపురం బస్సు ప్రమాదం.. 8మందిని కాపాడిన రియ‌ల్ హీరో బాలరాజు

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. మంటల్లో చిక్కుకున్న బస్సులో నుంచి 8మంది ప్రాణాలను కాపాడిన బాలరాజు ధైర్యం అందరినీ కదిలిస్తోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 10:01 ఉద.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Markapur Bus Accident Hero

అక్షరటుడే, వెబ్​డెస్క్: Markapur Bus Accident Hero | మార్కాపురం జిల్లాలో జరిగిన దారుణ బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనమవగా, 25 మందికిపైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో చోటుచేసుకున్న విషాదంతో పాటు, ఓ వ్యక్తి ప్రదర్శించిన ధైర్యసాహసం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Contents
  • Markapur Bus Accident Hero | రియ‌ల్ హీరో బాల‌రాజు..
    • Markapur Bus Accident Hero | ట్యాంక్ పగిలి డీజిల్ బస్సుపై చిందడంతో మంటలు

హనుమంతునిపాడు మండలం తక్కెళ్లపాడు (Takkellapadu)కు చెందిన బాలరాజు అదే బస్సులో ప్రయాణిస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మంటలు చెలరేగుతుండగా, సమయస్ఫూర్తితో స్పందించిన ఆయన బస్సు అద్దాలను రాడ్‌తో పగలగొట్టి 8మంది ప్రయాణికులను బయటకు దించారు. అనంతరం తాను కూడా దూకి ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. మరో మహిళను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె సీట్ల కింద ఇరుక్కుపోవడంతో కాపాడలేకపోయినట్లు బాలరాజు తెలిపాడు.

Markapur Bus Accident Hero | రియ‌ల్ హీరో బాల‌రాజు..

ప్రస్తుతం గాయాలతో ఆయన మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రి (Markapuram Government Hospital)లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం వేకువజామున సుమారు 5.40 గంటల సమయంలో రాయవరం సమీపంలో చోటుచేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్‌ (Harikrishna Travels)కి చెందిన బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా (Nellore District) కలిగిరికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో బస్సు అగ్నికి ఆహుతైంది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఐదు నెలల చిన్నారి కూడా ఉన్నారు. డ్రైవర్ సహా 25 మందికిపైగా గాయపడగా, వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది.

Markapur Bus Accident Hero | ట్యాంక్ పగిలి డీజిల్ బస్సుపై చిందడంతో మంటలు

ప్రాథమిక సమాచారం ప్రకారం, టిప్పర్ వాహనంలోని ఆయిల్ ట్యాంక్‌ను కాసేపటి ముందే డీజిల్‌తో నింపినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్యాంక్ పగిలి డీజిల్ బస్సుపై చిందడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో రెండు వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.మంటల్లో కాలిపోయిన మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతినడంతో, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తింపు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఎక్కువమంది నెల్లూరు జిల్లా ఉదయగిరి, మార్కాపురం ప్రాంతాలకు చెందినవారు. వీరంతా కామారెడ్డి, జగిత్యాల ప్రాంతాల్లో బేల్దారి పనులు చేసి, శ్రీరామనవమి సందర్భంగా సొంత ఊర్లకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. అయితే, ప్రాణాలకు తెగించి 8మందిని కాపాడిన బాలరాజు ధైర్యం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి : Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..

Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం
Social Media Ban Kids | 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియా బ్యాన్ ​: ఏపీ సీఎం చంద్రబాబు
Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు
Snake Bite Incident | కాటేసిన పాముతో హాస్పిటల్​కు వెళ్లిన వ్యక్తి
Eluru Child Tragedy | ఏలూరులో చోటు చేసుకున్న తీవ్ర విషాదం.. కూల్‌డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగి చిన్నారి మృతి
TAGGED:Harikrishna TravelsMarkapur Bus Accident HeroMarkapuram Government HospitalNellore DistrictTakkellapadu
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌! March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!
Next Article Petrol Excise Duty Cut Petrol Excise Duty Cut | పెట్రోల్, డీజిల్​​పై ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించిన కేంద్రం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?