Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Drunk Drive Fines Kamareddy | మందుబాబులకు షాక్​.. డ్రంకన్​ డ్రైవ్​లో ఒకేరోజు 525 మందికి జరిమానా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Drunk Drive Fines Kamareddy | మందుబాబులకు షాక్​.. డ్రంకన్​ డ్రైవ్​లో ఒకేరోజు 525 మందికి జరిమానా

నిజామాబాద్

Drunk Drive Fines Kamareddy | మందుబాబులకు షాక్​.. డ్రంకన్​ డ్రైవ్​లో ఒకేరోజు 525 మందికి జరిమానా

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు పదేపదే చెప్తున్నా, అవగాహన కల్పిస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 11:08 ఉద.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Drunk Drive Fines Kamareddy

అక్షరటుడే, కామారెడ్డి: Drunk Drive Fines Kamareddy | మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు పదేపదే చెబుతున్నా, అవగాహన కల్పిస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా ప్రతిరోజు పదుల సంఖ్యలో పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడుతున్నారు.

Contents
  • Drunk Drive Fines Kamareddy | తాజాగా ఒకేరోజు..
    • Drunk Drive Fines Kamareddy | రూ.4లక్షలకు పైగా జరిమానాలు..

Drunk Drive Fines Kamareddy | తాజాగా ఒకేరోజు..

ఇప్పటికే వేలాది మందికి జరిమానాలు, వందల మందికి జైలుశిక్షలు విధిస్తూ కోర్టు తీర్పులు చెప్పింది. తాజాగా ఒకేరోజు 525 మందికి శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) నివారించడంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో భారీ సంఖ్యలో వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పట్టుబడిన 525 మందిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలను విధించింది. ఈ క్రమంలో మొత్తం 525 మందికి శిక్షలు పడగా, అందులో 40 మందికి ఒక రోజు, నలుగురికి రెండు రోజులు, 9 మందికి 5 రోజులు, ముగ్గురికి 7 రోజుల పాటు జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తు కోర్టు తీర్పునిచ్చింది.

Drunk Drive Fines Kamareddy | రూ.4లక్షలకు పైగా జరిమానాలు..

వీరితో పాటు మిగతా వారికి కలిపి మొత్తం రూ.4,92,400 జరిమానా విధించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, బాధ్యతారాహిత్య చర్యలను అరికట్టడానికి పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం అనేది కేవలం చట్టరీత్యా నేరం మాత్రమే కాదని, అది ఒక ప్రాణాంతక నిర్ణయమని స్పష్టం చేశారు. ఒక్కరి నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండటం అనేది కేవలం చట్టానికి భయపడి చేసే పని కాదని, అది మన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ఇంకా కఠినంగా కొనసాగుతాయని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : Geo Spatial Technology India | జియో విద్యార్థులకు NIRDలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు: ప్రొఫెసర్ ఎం.వి. రవిబాబు

Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా
Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం
Kamareddy SI Retirement | ఇద్దరు ఎస్సైల పదవీ విరమణ
Government Degree College Facilities | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన విద్యా వసతులు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
TAGGED:drunk and drive finesDrunk driving IndiaKamareddy Policelaw enforcement newsRoad AccidentsRoad Safety AwarenessTelangana police actiontraffic rules Indiatraffic violations news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Narhari Zirwal Video Narhari Zirwal Video | ట్రాన్స్​జెండర్​తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్!
Next Article Fuel Export Tax India Fuel Export Tax India | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?