అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fuel Export Tax India | ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్‌పై భారీగా పన్ను విధించింది.
పశ్చిమాసియా (Western Asia)లో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అలాగే సరఫరాపై సైతం కొంత మేర ప్రభావం పడింది. దీంతో భారత్ నుంచి రిఫైనరీలు విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Minister Hardeep Singh Puri) శుక్రవారం వివరాలు వెల్లడించారు. దేశీయ సరఫరాకు ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచ అస్థిరత నుంచి వినియోగదారులను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Fuel Export Tax India | ఎగుమతులు తగ్గించడానికి..
భారత ఆయిల్ మార్కెట్ కంపెనీలు ముడి చమురును శుద్ధి చేసి అనేక దేశాలకు పెట్రోల్, డీజిల్ ఎగుమతి చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం దేశానికి అవసరమైన మేర దిగుమతులు రాకపోవడం, ముడి చమురు ధరల పెరుగుదలతో ఎగుమతులు తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం పన్నులు విధించింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నులను పునరుద్ధరించింది. వీటిపై వరుసగా లీటరుకు రూ. 21.5, రూ. 29.5 చొప్పున సుంకాలు విధించింది. 2024లో ఈ పన్నులను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా పునరుద్ధరించింది.
ఇది కూడా చదవండి : Petrol Excise Duty Cut | పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కేంద్రం

