Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sadabainama Registration Changes | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. సాదాబైనామా రిజిస్ట్రేష‌న్ల‌లో మార్పులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Sadabainama Registration Changes | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. సాదాబైనామా రిజిస్ట్రేష‌న్ల‌లో మార్పులు

తెలంగాణతాజా వార్తలు

Sadabainama Registration Changes | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. సాదాబైనామా రిజిస్ట్రేష‌న్ల‌లో మార్పులు

సాదాబైనామా రిజిస్ట్రేషన్ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్​ 76, 77 విడుదల చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 12:39 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Sadabainama Registration Changes

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sadabainama Registration Changes | సాదాబైనామా రిజిస్ట్రేషన్ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక మార్పులు చేసింది. దీంతో లక్షలాది మంది దరఖాస్తుదారులకు ఊరట లభించనుంది.

Contents
  • Sadabainama Registration Changes | తప్పుగా తేలితే కఠిన చర్యలు
    • Sadabainama Registration Changes | 30 రోజులు గడువు
      • ఐదు ఎకరాల్లోపు ఉచితం
        • విలీన గ్రామాల్లో..

బీఆర్​ఎస్​ (BRS) హయాంలో సాదాబైనామాల రిజిస్ట్రేషన్​ కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. గతంలో భూమి కొనుగోలు చేసిన వారితో పాటు అమ్మిన వారి అఫిడవిట్​ ఉండాలనే నిబంధన ఉండేది. అయితే అప్పట్లో వివిధ కారణాలతో భూములు అమ్మిన వారు.. ప్రస్తుతం ధరలు పెరగడంతో అఫిడవిట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. భూమి కొన్న వారి దగ్గర మళ్లీ డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల తండ్రులు భూములు అమ్మగా వారి వారసులు సాధాబైనామా కింద రిజిస్ట్రేషన్​కు ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూమి హక్కుల కోసం దరఖాస్తుదారుడితో పాటు భూమిని బదిలీ చేసే వ్యక్తి కూడా అఫిడవిట్ సమర్పించాలనే నిబంధనను తొలగించింది.

Sadabainama Registration Changes | తప్పుగా తేలితే కఠిన చర్యలు

ఇక నుంచి భూమి హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అయితే తప్పుడు సమాచారం అందించినట్లు తేలితే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. సదరు సాదాబైనామా రిజిస్ట్రేషన్‌‌ను రద్దు చేయడంతో పాటు చెల్లించిన ఫీజులు, స్టాంపు డ్యూటీని జప్తు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అంతేగాకుండా క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించింది.

Sadabainama Registration Changes | 30 రోజులు గడువు

సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు (Sadabainama Registration) ముందు 30 రోజులు అభ్యంతరాల స్వీకరణ కోసం గడువు ఇస్తారు. నిర్ణిత గడువులోగా ఎవరైనా అభ్యంతరం చెబితే ఆ రిజిస్ట్రేషన్​ను నిలిపి వేస్తారు. లేదంటే ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ కొత్త నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. కాగా సాదాబైనామా కింద గతంలో మొత్తం 9,00,880 దరఖాస్తులు వచ్చాయి.

ఐదు ఎకరాల్లోపు ఉచితం

సాదాబైనామా కోసం 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 మధ్య దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో ఐదు ఎకరాల్లోపు ఉన్న వాటిని ఉచితంగా చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయించనున్నట్లు పేర్కొంది.

విలీన గ్రామాల్లో..

మున్సిపాలిటీల్లో (Municipalities) విలీనం అయిన గ్రామాల్లో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు జీవో 77 జారీ చేసింది. అనేక గ్రామాలు మున్సిపల్, కార్పొరేషన్​లలో కలిశాయి. దీంతో ఆయా గ్రామాల్లోని సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలా లేదా అని అధికారులు కొంతకాలంగా అయోమయంలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం విలీన గ్రామాల్లో దరఖాస్తులకు మోక్షం కలిగించేలా జీవో విడుదల చేసింది.

ఇది కూడా చదవండి : Bandi Sanjay Song | శ్రీరామనవమి సందర్భంగా పాటతో ఆకట్టుకున్న బండి సంజయ్

Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్
Telangana Engineering Fees | ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. అత్యధికంగా సీబీఐటీలో..
Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం
Hyundai Verna 2026 | హ్యుందాయ్ సరికొత్త వెర్నా.. రూ. 10.98 లక్షల నుంచి ప్రారంభం
Ramzan Holiday in AP | రంజాన్ సెలవు తేదీ మార్పు.. మార్చి 21కు షిఫ్ట్, పదో తరగతి పరీక్ష వాయిదా
TAGGED:affidavit rule changeBRSgovernment policy updateland ownership Indialand registration rules IndiaMunicipalitiesproperty rights updatereal estate IndiaSadabainama RegistrationSadabainama Registration Changesstamp duty exemptionState Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Loss India Stock Market Loss India | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Next Article Ayodhya Ram Mandir Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుతం.. బాలరాముడికి సూర్యతిలకం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?