అక్షరటుడే, వెబ్డెస్క్ : Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయింది. శ్రీరామ నవమి (Sri Ram Navami) రోజు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడటంతో భక్తులు తన్మయత్వం చెందారు.
దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాముడి జన్మ స్థలం అయోధ్యలో సంబరాలు ఆకాశాన్ని అంటాయి. బాలరాముడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో శుక్రవారం ఆలయంలోని రాముడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి. నుదిటిపై కిరణాలు తిలకంలా దర్శనం ఇచ్చాయి. మధ్యాహ్నం 12 గంటలకు రామ్ లల్లా విగ్రహం నుదుటిపైకి శాస్త్రీయ పద్ధతిలో సూర్యకిరణాలు పడ్డాయి. రాముడిపై కిరణాలు పడేలా మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి శ్రీరామ నవమికి స్వామిపై కిరణాలు పడేలా టెక్నాలజీని వినియోగించారు.
Ayodhya Ram Mandir | తరలి వచ్చిన భక్తులు
రామనవమి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలి వచ్చారు. పవిత్ర స్నానం చేసిన అనంతరం, భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నారు. “జై శ్రీ రామ్” నినాదాలతో నగరం మారుమోగింది. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
దీనిని కూడా చదవండి : Petrol Excise Duty Cut | పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కేంద్రం

