అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Sita Rama Kalyanam | జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు (Sri Rama Navami Celebrations) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నర్సింగ్‌పల్లి (Narsingpalli)లోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Sita Rama Kalyanam | తరలివచ్చిన భక్తజనం..
వనమాల క్షేత్రంలో వేద పండితుడు సంపత్ కుమారాచార్య, ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య ప్రత్యేక పూజలు, కల్యాణం నిర్వహించారు. శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని ధర్మకర్తలైన శ్రీమాన్ నరసింహారెడ్డి దంపతులు విజయసింహారెడ్డి దంపతులు, గత ఏడాది లక్కీ డిప్లో అవకాశం పొందిన 9 మంది జంటలు కర్తలుగా ఉండి కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు సీతారామ కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. అనంతరం స్వామి వారి తదియారాధన అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డితో పాటు ఆలయ సేవకులు, నర్సారెడ్డి, నరాల సుధాకర్, సాయిలు, భాస్కర్, మురళి, పృథ్వీ, ప్రవీణ్, విజయ్ స్వామి, అనిల్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Raghunath Temple | రఘునాథ ఆలయంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

