అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PF Withdrawal App | ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Provident Fund Organization) తో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్లకుపైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అనుబంధం ఉంది. ప్రతినెలా ఉద్యోగుల బేసిక్ పే నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలోకి చేరుతోంది. అయితే గతంలో పీఎఫ్ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసిన తర్వాత కొంత కాలం వేచి ఉండాల్సి వస్తోంది.
తన ఖాతాదారులు యూపీఐ (UPI) ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు పీఎఫ్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు కల్పించడం కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో కొత్త యాప్‌ను తీసుకువస్తోంది. ఆ యాప్ వచ్చాక పీఎఫ్ ఉపసంహరణకోసం వేచి ఉండాల్సిన సమయం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ డాక్యుమెంటేషన్ కూడా అవసరం ఉండదు. ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా ఆధార్ ఓటీపీ మరియు బయోమెట్రిక్ ధ్రువీకరణతో సురక్షితంగా లావాదేవీలు జరపవచ్చని సంస్థ పేర్కొంటోంది.
PF Withdrawal App | 75 శాతం విత్‌డ్రాకు అవకాశం
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కొత్త మొబైల్ యాప్ (New Mobile App)ను తీసుకువస్తోంది. ఇది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులో ఉండనుంది. దీని ద్వారా సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు యూపీఐ లేదా ఏటీఎం ద్వారా తక్షణం లేదా 24 గంటల్లో ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 25 శాతం మొత్తాన్ని రిటైర్మెంట్ ఫండ్ కోసం ఖాతాలో ఉంచడం తప్పనిసరి. ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. మిగిలిన 25 శాతం పీఎఫ్‌ను నిర్ణీత సమయం తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి యాప్ అందుబాటులోకి రానుంది. తదుపరి సమాచారం కోసం ఈపీఎఫ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
PF Withdrawal App | యాప్‌లోని ముఖ్య సౌకర్యాలు..
యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది.
ఏటీఎం నుంచి కూడా పీఎఫ్ సొమ్ము విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉన్న మొత్తాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
రూ. 5 లక్షల వరకు ఆటో సెటిల్‌మెంట్ (వేగవంతమైన ప్రాసెసింగ్) సౌకర్యం ఉంటుంది.
పాస్‌బుక్ బ్యాలెన్స్, నామినీ అప్‌డేట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ వంటి సేవలు కూడా దీని ద్వారా పొందవచ్చు.
ఇది కూడా చదవండి : Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు

