Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lockdown Rumors | లాక్ డౌన్ దిశగా అడుగులు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Lockdown Rumors | లాక్ డౌన్ దిశగా అడుగులు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం

జాతీయం

Lockdown Rumors | లాక్ డౌన్ దిశగా అడుగులు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం

అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ముదురుతుండడంతో ఇంధన సంక్షోభం దిశగా ప్రపంచం సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ ప్రచారం జరుగుతోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 3:42 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Lockdown Rumors

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lockdown Rumors | పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రపంచం ఇంధన సమస్య ఎదుర్కొంటోంది. దేశంలో ఇప్పటికైతే పెట్రోల్, డీజిల్ కొరత లేనప్పటికీ ఎల్‌పీజీ షార్టేజ్ (LPG Shortage) కనిపిస్తోంది. దీంతో సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించవచ్చనే వదంతులు వ్యాపిస్తున్నాయి.

Contents
  • Lockdown Rumors | పలు దేశాలలో ఎనర్జీ లాక్ డౌన్ ?
    • Lockdown Rumors | ఖండించిన కేంద్రం

పెట్రోల్, డిజిల్ ను ఆదా చేసేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించవచ్చంటూ శివసేన సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యాలు భయాలను పెంచాయి. మరోవైపు ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ (Prime Minister Modi) వర్చువల్ మీటింగ్ నిర్వహించనున్నారు. పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల భారతదేశంపై ఏమైనా ప్రభావం ఉంటుందా, ఎల్‌పీజీ, ఆయిల్ సరఫరా ఎలా ఉంది అనే అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కరోనా సమయంలో ఎదురైన సప్లై చైన్ సమస్యలను ప్రస్తావించడంతో ఈ రూమర్స్ మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.

Lockdown Rumors | పలు దేశాలలో ఎనర్జీ లాక్ డౌన్ ?

ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం నాలుగు వారాలుగా కొనసాగుతుండడం, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) నుంచి నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సమస్య ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యను తగ్గించడానికి కొన్ని దేశాలు ఇప్పటికే పలు ఆంక్షలు విధించాయి. ఫిలిప్పీన్స్, శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, మయన్మార్, ఈజిప్ట్ వంటి దేశాలు పెట్రోల్, డిజీల్, విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించాయి. పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు, ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. పెట్రోల్, డీజిల్ ఎక్కువ కొనకుండా పరిమితులు విధించాయి.

Lockdown Rumors | ఖండించిన కేంద్రం

మన దేశంలో లాక్ డౌన్ వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టత ఇచ్చారు. ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం బాధ్యతారహితమైన హానికరమైన చర్య. అని ఆయన అభివర్ణించారు. ‘క్లిష్ట సమయంలో మనం ప్రశాంతంగా, బాధ్యతగా మరియు ఐక్యంగా ఉండాలి. రూమర్స్ వ్యాప్తి చేయడం చాలా తప్పు. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సరఫరా సాధారణంగానే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు సాధారణంగా నడుస్తున్నాయి’ అని మంత్రి హర్దీప్ పూరి వివరించారు. దేశంలో కోవిడ్ తరహా లాక్‌డౌన్ విధించే అవకాశమే లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. కొంతమంది రాజకీయా నాయకులు లాక్‌డౌన్ గురించి మాట్లాడి ప్రజలను భయపెట్టడం బాధాకరం అన్నారు.

ఇది కూడా చదవండి : PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్

Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ట్విస్ట్​.. కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు
Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ .. రాజీనామా చేయనున్న సీఎం నితీశ్​?
Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
TAGGED:fuel crisis updatesglobal oil crisisgovernment clarificationHardeep Singh PuriLockdown RumorsLPG shortagelpg shortage indiaNarendra Modi meetingNirmala SitharamanPrime Minister ModiStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kavitha New Party Kavitha New Party | ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన
Next Article Sita Rama Kalyanam in Yellareddy Sita Rama Kalyanam in Yellareddy | సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?