Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Old Pillow Effects | ఒకే దిండును ఏళ్ల తరబడి వాడుతున్నారా.. అయితే గ్యారెంటీగా ఇవి..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Old Pillow Effects | ఒకే దిండును ఏళ్ల తరబడి వాడుతున్నారా.. అయితే గ్యారెంటీగా ఇవి..!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Old Pillow Effects | ఒకే దిండును ఏళ్ల తరబడి వాడుతున్నారా.. అయితే గ్యారెంటీగా ఇవి..!

మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంత అవసరమో, మనం తల కింద పెట్టుకునే దిండు కూడా అంతే ముఖ్యం. చాలామంది బెడ్ షీట్లు, దిండు కవర్లు(Covers) మారుస్తారు కానీ, దిండును మాత్రం ఏళ్ల తరబడి వాడుతూనే ఉంటారు.

Naresh chandan
Last updated: మార్చి 27, 2026 4:20 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Old Pillow Effects | ఒకే దిండును ఏళ్ల తరబడి వాడుతున్నారా.. అయితే గ్యారెంటీగా ఇవి..!
Old Pillow Effects | ఒకే దిండును ఏళ్ల తరబడి వాడుతున్నారా.. అయితే గ్యారెంటీగా ఇవి..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Old Pillow Effects | “దిండే కదా.. ఏమవుతుంది?” అని నిర్లక్ష్యం చేస్తే, అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత దిండు వల్ల వచ్చే నష్టాలు, దానిని ఎప్పుడు మార్చాలో తెలుసుకుందాం..

Contents
  • Old Pillow Effects | అలర్జీలు , శ్వాస సమస్యలు:
    • Old Pillow Effects | చర్మ సమస్యలు:
      • మెడ, వెన్నునొప్పి:
      • నిద్రలేమి – మానసిక ఒత్తిడి:
      • దిండు మార్చే సమయం వచ్చిందని ఎలా తెలుసుకోవాలి?

Old Pillow Effects | అలర్జీలు , శ్వాస సమస్యలు:

మనం నిద్రపోయేటప్పుడు శరీరం నుంచి రాలే మృత చర్మ కణాలు, చెమట, నూనెలు దిండులోకి చేరుతాయి. కాలక్రమేణా అందులో కంటికి కనిపించని దుమ్ము పురుగులు (Dust Mites), బ్యాక్టీరియా పేరుకుపోతాయి. దీనివల్ల ఉబ్బసం (Asthma), అలర్జీలు, తరచూ తుమ్ములు రావడం వంటి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి.

Old Pillow Effects | చర్మ సమస్యలు:

ఎన్ని రకాల క్రీములు వాడినా మొటిమలు తగ్గకపోవడానికి పాత దిండు కూడా ఒక కారణం కావచ్చు. దిండులో పేరుకుపోయిన బ్యాక్టీరియా ముఖ చర్మానికి తగిలినప్పుడు ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, మొటిమలు (Acne) వచ్చే ప్రమాదం ఉంది. పాత దిండు కాలక్రమేణా బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుందనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.

మెడ, వెన్నునొప్పి:

దిండు పాతగా మారే కొద్దీ అది తన ఆకృతిని (Shape) కోల్పోతుంది. లోపల ఉన్న మెటీరియల్ గడ్డలుగా మారడం లేదా మరీ మెత్తగా అయిపోవడం వల్ల నిద్రలో మెడకు, వెన్నెముకకు సరైన సపోర్ట్ లభించదు. ఫలితంగా ఉదయం లేవగానే మెడ నొప్పి, భుజాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి వేధిస్తాయి.

నిద్రలేమి – మానసిక ఒత్తిడి:

దిండు అసౌకర్యంగా ఉంటే నిద్రలో పదే పదే మెలకువ వస్తుంది. సరైన పొజిషన్ దొరక్క అటు ఇటు దొర్లడం వల్ల గాఢ నిద్ర కరవవుతుంది. ఇది దీర్ఘకాలంలో నిద్రలేమి (Insomnia) సమస్యకు, తద్వారా మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.

దిండు మార్చే సమయం వచ్చిందని ఎలా తెలుసుకోవాలి?

దిండును మధ్యలోకి మడిచి చూడండి. అది వెంటనే మళ్ళీ పాత స్థితికి రాకపోతే, ఆ దిండు పని అయిపోయిందని అర్థం. దిండుపై పసుపు రంగు మచ్చలు ఏర్పడినా లేదా ఒక రకమైన దుర్వాసన వస్తున్నా వెంటనే మార్చేయాలి. సాధారణంగా ప్రతి ఒకటిన్నర (18 నెలలు) నుంచి రెండేళ్లకు ఒకసారి కొత్త దిండుకు మారడం ఆరోగ్యకరం.

దిండును ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎండలో ఉంచడం లేదా ఉతకడం ద్వారా బ్యాక్టీరియాను కొంతవరకు అరికట్టవచ్చు.

ఇది కూడా చదవండి: Diabetes Toothpaste Safety | షుగర్ పేషంట్లు తియ్యగా ఉండే పేస్ట్‌లు వాడొచ్చా? వాడితే ఏమౌతుంది?

Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్!
Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
India Dairy Consumption | భారతీయ గృహ పోషణలో డైరీ విప్లవం: 75.8 శాతం మంది యాక్టివ్ వినియోగదారులే!
Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా!
TAGGED:dust mites allergyhealthy sleeping tipsinsomnia issuesneck pain causesold pillow effectspillow hygienepillow replacementSleep Health
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kidney Disease | కిడ్నీలు పాడవుతున్నాయని చెప్పే 'రెడ్ సిగ్నల్స్' ఇవే.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే డేంజరే! Kidney Disease | కిడ్నీలు పాడవుతున్నాయని చెప్పే ‘రెడ్ సిగ్నల్స్’ ఇవే.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే డేంజరే!
Next Article Armoor Police | Yellareddy Police | జీవితంపై విరక్తితో ఒకరి బలవన్మరణం
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Yellareddy Police | కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?