అక్షరటుడే, కామారెడ్డి: Gaddam Chandrasekhar Reddy | కామారెడ్డిలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. స్వామి వారి కల్యాణాన్ని(Ram Navami celebrations) తిలకించి భక్తులు పరవశించిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, (Telangana Congress)ఆయన సతీమణి మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ (Kamareddy politics) పలు ఆలయాల్లో పూజల్లో పాల్గొన్నారు.
Gaddam Chandrasekhar Reddy | మెడికల్ కళాశాల సమీపంలో..
పట్టణంలోని మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన స్వామివారి కల్యాణం (political news Telangana) కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆలయ పూజారి రమేష్ జోషి దంపతులిద్దరికీ ఆశీర్వచనం అందజేశారు. పూజలో పాల్గొన్న ఇద్దరినీ ఆశీర్వదిస్తూ ‘శీఘ్రమేవ ఎమ్మెల్యే పదవి ప్రాప్తిరస్తు’ అంటూ దీవించారు. ప్రస్తుతం ఆశీర్వచనానికి సంబంధించిన వీడియో (temple event India) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొద్దిరోజులుగా కామారెడ్డి (Kamareddy) ఎమ్మెల్యేగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారన్న ప్రచారం నేపథ్యంలో రాములోరి కల్యాణంలో పాల్గొన్న చంద్రశేఖర్ రెడ్డి దంపతులను పూజారి ఆశీర్వదించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఇది కూడా చదవండి: Kavitha New Party | ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన

