Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Drug Bust | నగరంలో డ్రగ్స్​, గంజాయి విక్రయాలు.. పలువురి అరెస్ట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Hyderabad Drug Bust | నగరంలో డ్రగ్స్​, గంజాయి విక్రయాలు.. పలువురి అరెస్ట్​

క్రైంహైదరాబాద్

Hyderabad Drug Bust | నగరంలో డ్రగ్స్​, గంజాయి విక్రయాలు.. పలువురి అరెస్ట్​

హైదరాబాద్​లో డ్రగ్స్​, గంజాయి విక్రయిస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 6:54 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Hyderabad Drug Bust

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Drug Bust | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో డ్రగ్స్​, గంజాయి దందా ఆగడం లేదు. పోలీసులు దాడులు చేస్తున్న నిందితులు విక్రయాలు సాగిస్తున్నారు. విద్యార్థులు, యువత వీటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Contents
  • Hyderabad Drug Bust | పరారీలో ప్రధాన నిందితులు
    • Hyderabad Drug Bust | గంజాయి స్వాధీనం

నగరంలో డ్రగ్స్​ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. టాస్క్​పోర్స్ (Taskforce)​, సనత్‌నగర్ (Sanath Nagar) పోలీసులతో కలిసి దాడులు చేపట్టారు. ఇద్దరు మైనర్లు, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 60 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad Drug Bust | పరారీలో ప్రధాన నిందితులు

హేమంత్​ (23), నాగేంద్ర (21) అనే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నగరంలో తెలిసిన కస్టమర్లకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సాయి నిఖిల్ యాదవ్, ఆదిత్య అనే ఇద్దరు కీలక సరఫరాదారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం పోలీసులకు చిక్కిన నిందితులు మద్యం, గంజాయి, MDMAకు బానిసలు అయ్యారు. చింతల్‌లోని సరఫరాదారులతో పరిచయాలు పెంచుకుని తక్కువ ధరలకు MDMAను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అనంతరం దానిని ఎక్కువ ధరకు కస్టమర్లకు విక్రయిస్తున్నారు.

Hyderabad Drug Bust | గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌లో సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ సమీపంలో 10.16 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా నగరంలో ఇటీవల గంజాయి, డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. పలువురు మొదట ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. అనంతరం డబ్బుల కోసం దందాలోకి దిగుతున్నారు. యువత, విద్యార్థులు వీటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

దీనిని చదవండి : Cyber Fraud | మాజీ ప్రొఫెసర్​కు సైబర్​ నేరగాళ్ల టోకరా.. రూ.కోటి స్వాహా

Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య
YouTuber Komali Death | సోషల్ మీడియాతో పాపుల‌ర్‌.. ప్రేమ‌లో విఫ‌లం కావ‌డంతో యువ యూట్యూబర్ కోమలి మృతి
Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
TAGGED:Drug Bust Indiadrug traffickingganja smugglingHyderabad newsmdma seizurepolice crackdown
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bhadrachalam Temple Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు
Next Article Allahabad High Court Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?