అక్షరటుడే, వెబ్డెస్క్ : Allahabad High Court | పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహ జీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పెళ్లయిన వ్యక్తి.. వేరే మహిళతో ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే ఏ చట్టం అడ్డుకోలేదని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో వివాహేతర సంబంధాల (Extramarital affairs)తో ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తమ సంబంధానికి అడ్డు వస్తున్నారని పలువురు భార్యలు ప్రియుడితో కలిసి భర్తలను హత్యలు చేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కడతేరుస్తున్న పురుషులు ఉన్నారు. అలాగే పలువురు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు తీవ్ర చర్చకు దారి తీసింది.
Allahabad High Court | రక్షణ కల్పించాలి
వివాహితుడైన పురుషుడు, 18 ఏళ్లు నిండిన మహిళ సమ్మతితో సహజీవనం చేస్తే అందులో ఎలాంటి నేరం లేదని కోర్టు పేర్కొంది. ఆ జంటకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. నైతికత, చట్టం వేరుగా ఉంటాయని పేర్కొంది. పౌరుల హక్కులను రక్షించేటప్పుడు సామాజిక అభిప్రాయాలు, నైతిక దృక్కోణాలు తమ చర్యలను నిర్దేశించవని తెలిపింది.
Allahabad High Court | కేసు వివరాలు..
ఓ వ్యక్తికి పెళ్లి అయింది. అతను 18 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు అతడిపై కేసు పెట్టారు. అతనికి వివాహమైనందున, మరో మహిళతో కలిసి జీవించడం నేరమని ఆ కుటుంబం వాదించింది. అయితే కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. వివాహితుడు, సమ్మతితో వయోజనురాలితో సహజీవనం చేస్తున్నంత మాత్రాన, అతనిపై ఎలాంటి నేరం మోపడానికి వీల్లేదని తెలిపింది. సదరు మహిళ తన ఇష్టపూర్వకంగానే అతడితో ఉంటున్నట్లు పోలీసులకు దరఖాస్తు ఇచ్చినట్లు కోర్టు గుర్తు చేసింది. ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
దీనిని కూడా చదవండి : Traffic Problems | ట్రాఫిక్‌లోనే సగం జీవితం!

