Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Saleshwaram Jathara | తెలంగాణ అమర్​నాథ్ సలేశ్వరం.. జాతరకు అధికారుల ఏర్పాట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Saleshwaram Jathara | తెలంగాణ అమర్​నాథ్ సలేశ్వరం.. జాతరకు అధికారుల ఏర్పాట్లు

భక్తి

Saleshwaram Jathara | తెలంగాణ అమర్​నాథ్ సలేశ్వరం.. జాతరకు అధికారుల ఏర్పాట్లు

సలేశ్వరం జాతర ఏప్రిల్ 1 నుంచి 3 వరకు సాగనుంది. జాతర కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 8:05 సా.
Srinivas Kolluri
14 గంటలు ago
Share
Saleshwaram Jathara

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Saleshwaram Jathara | పచ్చని అడవుల్లో జలపాతం సవ్వడుల మధ్య గుహలో కొలువైన పరమశివుడి దర్శనానికి వేళ అయింది. నల్లమల అడవుల్లో (Nallamala Forest) కొలువైన లింగమయ్య జాతరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండదారుల్లో సాహసోపేతమైన సలేశ్వరం యాత్ర తెలంగాణ అమర్​నాథ్​గా ప్రసిద్ధి చెందింది. ఈ జాతర ఏప్రిల్ 1 నుంచి 3 వరకు సాగనుంది. దీంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Contents
  • Saleshwaram Jathara | ప్రకృతి అందాల మధ్య..
    • Saleshwaram Jathara | వీరు జాగ్రత్త
      • Saleshwaram Jathara | ప్రత్యేక బస్సులు

నల్లమల అడవుల్లో నాగర్​ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో సలేశ్వరం జాతర సాగుతుంది. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన సహజ శివలింగాన్ని దర్శించుకోవడం అంటే.. భక్తి యాత్ర మాత్రమే కాదు.. సాహస యాత్ర కూడా. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు. నడుచుకుంటూ దాదాపు 4 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. కొండలు, గుట్టల్లో ట్రెక్కింగ్​ చేస్తూ స్వామి దర్శనానికి వెళ్లాలి. ఏడాదిలో ఎక్కసారి మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు.

Saleshwaram Jathara | ప్రకృతి అందాల మధ్య..

సలేశ్వరం జాతర అంటే ప్రకృతి అందాల మధ్య సాగుతుంది. అయితే ఇది సాహస యాత్ర అనే చెప్పాలి. దట్టమైన అరణ్యం, జలపాతాలు, లోతైన లోయల మధ్య యాత్ర సాగుతుంది. భక్తులు దీనిని పవిత్రంగా భావిస్తారు. నల్లమలలోని చెంచులే లింగమయ్య (Lingamayya)కు పూజారులుగా వ్యవహరిస్తారు. కాగా ఈ మార్గంలో వన్యప్రాణులు కూడా ఉంటాయి. అయినా కూడా భక్తులు స్వామివారి మీద భక్తితో వెళ్తారు.

Saleshwaram Jathara | వీరు జాగ్రత్త

ఈ యాత్రలో భాగంగా సుమారు 4 కిలోమీటర్ల మేర కాలినడకన లోయలోకి దిగాలి. కొన్ని చోట్ల దారి ఒక్క అడుగు వెడల్పు మాత్రమే ఉంటుంది. ఏ మాత్రం పట్టు తప్పిన లోయలో పడిపోతారు. ఈ మార్గంలో భక్తులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఈ యాత్రకు వెళ్తే జాగ్రతలు పాటించాలి. అలాగే శ్వాస సంబంధ వ్యాధులు ఉన్న వారు వెళ్లకపోవడం ఉత్తమం. భక్తులు బూట్లు, టార్చ్​, నీళ్లు వెంట తీసుకెళ్లాలి. అడవిలో చెత్త, ప్లాస్టిక్​ పాడేయొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు.

Saleshwaram Jathara | ప్రత్యేక బస్సులు

సలేశ్వరం జాతర కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎంజీబీఎస్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అలాగే యాత్ర కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.

దీనిని కూడా చదవండి : Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు

Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!
March 10 Horoscope | ఈ రాశుల వారికి ఆఫీసులో పెరగనున్న గౌరవం.. శత్రువులు కూడా మిత్రులుగా మారడం ఖాయం!
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
March 16 Horoscope : రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు గోల్డెన్ టైమ్.. ఆ రాశుల వారికి తిరుగులేని రాజయోగం!
Partial Lunar Eclipse | చంద్రగ్రహణం.. పాక్షికమే!
TAGGED:aleshwaram jatharaamarnath telangananallamala forestshiva temple trekTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Allahabad High Court Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
Next Article Sri Rama Pallaki Seva Sri Rama Pallaki Seva | ఘనంగా శ్రీరాముడి పల్లకి సేవ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?