అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Osmania Biscuits Adulteration | ఉస్మానియా బిస్కెట్లను ఎంతోమంది ఇష్టంగా తింటారు. హైదరాబాద్‌లో టీ తాగడానికి కేఫ్‌కు వెళ్తే.. నోరూరించే ఉస్మానియా బిస్కెట్లను సైతం చాలా మంది తీసుకుంటారు. అయితే వీటిని కూడా కల్తీ చేస్తున్నారు.
క్యాన్సర్ కారకాలతో ఉస్మానియా బిస్కెట్లు (Osmania Biscuits) తయారు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని అంబర్‌పేట్ (Amberpet)లో అక్రమ ఉస్మానియా బిస్కెట్ తయారీ యూనిట్‌పై పోలీసులు దాడులు చేశారు. ప్రమాదకర రసాయనాలు, కృత్రిమ రంగులతో బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటి తయారీ కోసం కుళ్లిన కోడిగుడ్లు వినియోగిస్తున్నారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో యూనిట్ నిర్వహిస్తున్నారు.
Osmania Biscuits Adulteration | నిందితుడి అరెస్ట్
అంబర్‌పేట్ పరిధిలోని కమలానగర్ (Kamalanagar) ప్రాంతంలో మేరజ్ బేకరి పేరుతో కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. బిస్కెట్లు మంచి రంగులోకి వచ్చేందుకు కెమికల్స్ వాడుతున్నారని తెలిపారు. ఫ్యాక్టరీ యజమాని మేరజ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Osmania Biscuits Adulteration | కుళ్లిన చికెన్ స్వాధీనం

కుళ్ళిన చికెన్‌ను సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె. నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్, జింకలవాడ వద్ద ఉన్న ‘మెసర్స్ ఎస్పీఆర్ చికెన్’ సెంటర్‌పై తనిఖీలు నిర్వహించింది. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను అధికారులు గుర్తించారు. దీనిని స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు సూరజ్ పాల్ (66)ను అరెస్ట్ చేశారు. సుమారు 352 కిలోల గడ్డకట్టిన కుళ్లిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి : Hyderabad Drug Bust | నగరంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు.. పలువురి అరెస్ట్

