Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Musi River Cleanup | మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం : సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Musi River Cleanup | మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణతాజా వార్తలు

Musi River Cleanup | మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం : సీఎం రేవంత్​రెడ్డి

ఎన్ని అడ్డంకులు వచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 11:10 ఉద.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Musi River Cleanup

అక్షరటుడే, వెబ్​డెస్క్: Musi River Cleanup | మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. శనివారం ఆయన మంచిరేవులలో మాట్లాడారు. కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం మూసీ ప్రాజెక్ట్​ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఆరు నూరైనా మూసీ ప్రాజెక్ట్ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Contents
  • Musi River Cleanup | ఎంతో నష్టపోయాం
    • Musi River Cleanup | ఆ శివుడే కాపాడుతాడు
      • Musi River Cleanup | గోదావరి జలాలు తీసుకొస్తాం

మంచిరేవులలో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం పర్యటించారు. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం, ఆధునిక గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్ల వ్యయంతో 8 ఎకరాల్లో ఆలయం నిర్మించనున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయం నిర్మించనుండగా.. వంద అడుగులతో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడారు. చారిత్రాత్మక ఆలయ పునరుద్ధణ చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

Musi River Cleanup | ఎంతో నష్టపోయాం

మూసీ నది (Musi River)ని ప్రక్షాళన చేయాలని చాలా మంది ముఖ్యమంత్రులు ప్రయత్నించారన్నారు. అవి ముందుకు సాగలేదన్నారు. తాము మాత్రం విమర్శలు వచ్చిన, అడ్డంకులు వచ్చిన తాము మూసీ ప్రాజెక్ట్​ చేపడుతామన్నారు. రాష్ట్రంలో నది జలాలను సరైన రీతిలో వినియోగించుకోకపోవడంతో కొన్ని తరాలు నష్టపోయాయని ఆవేదన సీఎం వ్యక్తం చేశారు. నదులను మనం కలుషితం చేశామన్నారు. మానవ తప్పిదంతో జరిగిన కలుషితం అయిన మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రస్తుతం ఢిల్లీ (Delhi)లో కాలుష్యంతో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్​కు ఆ పరిస్థితి రాకుండా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

Musi River Cleanup | ఆ శివుడే కాపాడుతాడు

ఓంకారేశ్వ ఆలయ (Omkareshwar Temple) నిర్మాణంతో మూసీ ప్రాజెక్ట్​కు శ్రీకారం చుడుతామని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్ట్​కు​ ఎదురయ్యే అడ్డంకుల నుంచి ఆ శివుడే కాపాడుతాడని చెప్పారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో పాతబస్తీలో మసీద్​ కడతామన్నారు. అలాగే సిక్కుల కోసం ఓ ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఉప్పల్​, నాగోల్​ ప్రాంతంలో చర్చిని కడతామన్నారు. రామప్ప ఆలయ నమూనాతో మంచిరేవులలో గుడి నిర్మిస్తామన్నారు. గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Musi River Cleanup | గోదావరి జలాలు తీసుకొస్తాం

గోదావరి జలాలను మూసీకి తీసుకొస్తామని సీఎం తెలిపారు. 20 టీఎంసీలను హైదరాబాద్​ (Hyderabad) నగరానికి తరలించి తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : Osmania Biscuits Adulteration | క్యాన్సర్​ కారకాలతో ఉస్మానియా బిస్కెట్ల తయారీ

Telangana Education Commission | విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అశాస్త్రీయం..: టీపీటీఫ్​
 Telangana Budget 2026 | రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్​
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ
India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
TAGGED:CM Revanth ReddyDelhiHyderabadMusi RiverMusi River CleanupOmkareshwar Temple
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Osmania Biscuits Adulteration Osmania Biscuits Adulteration | క్యాన్సర్​ కారకాలతో ఉస్మానియా బిస్కెట్ల తయారీ
Next Article Loan Apps Loan Apps | లోన్​ యాప్స్​కు మరో యువకుడు బలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?