Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ethanol Usage India | ఇథనాల్​ వాడకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Ethanol Usage India | ఇథనాల్​ వాడకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

జాతీయం

Ethanol Usage India | ఇథనాల్​ వాడకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పెట్రోల్​లో ఇథనాల్ కలపడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గిందన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 2:06 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Ethanol Usage India

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ethanol Usage India | ఇథనాల్​ వినియోగంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.

Contents
  • Ethanol Usage India | భారం పడకుండా చర్యలు
    • Ethanol Usage India | యూపీ అభివృద్ధి
      • Ethanol Usage India | ఏటీఎంలా వాడుకున్నారు

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. పెట్రోల్‌ స్థానంలో ఇథనాల్‌ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇథనాల్‌ వాడకం (Use of Ethanol) పెరిగితే.. రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. అలాగే ముడి చమురు దిగుమతులపై భారతదేశం ఆధారపడటం తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్​లో 10 శాతం ఇథనాల్ కలుపుతున్నారు. ఇక నుంచి దానిని 20శాతానికి పెంచనున్నారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడానికి సహకరించిన చెరుకు రైతులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

Ethanol Usage India | భారం పడకుండా చర్యలు

పెట్రోల్‌ (Petrol)లో ఇథనాలు కలపకపోయి ఉంటే మనం విదేశాల నుంచి 4.5 కోట్ల బ్యారెళ్లు అంటే 700 కోట్ల లీటర్లు దిగుమతి చేసుకోవలసి వచ్చేదన్నారు. ఈ నిర్ణయంతో దేశ రైతులకు మేలు జరిగిందని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు చేపట్టినట్లు మోదీ తెలిపారు. యుద్ధం ఎఫెక్ట్​తో అనేక దేశాల్లో ఆహార పదార్థాలు, పెట్రోల్, ఎరువులు, ఇతర నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరిగాయన్నారు.

Ethanol Usage India | యూపీ అభివృద్ధి

నోయిడాలో అతిపెద్ద సెమీకండక్టర్‌ ఫ్యాక్టరీని ఇటీవల ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. ఇక్కడి నుంచే మీరట్‌ మెట్రో విస్తరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఓ ఉదాహరణ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లపై ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును ఆలస్యం చేయడానికి వారే కారణమని ఆరోపించారు.

Ethanol Usage India | ఏటీఎంలా వాడుకున్నారు

ఎస్పీ నాయకులు దోపిడీ కోసం నోయిడాను ఒక ఏటీఎంలా వాడుకున్నారని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏళ్ల తరబడి విమానాశ్రయ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయని విమర్శించారు. నోయిడా (Noida)ను సందర్శిస్తే ఓడిపోతామని సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ఇక్కడకు రావడానికి భయపడేవారన్నారు.

ఇది కూడా చదవండి..: Indigo Emergency Landing | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం
Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
SCB Hospital Fire | కటక్ ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలోని 10 మంది రోగులు మృతి
PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్
Egg Prices Drop | భారీగా తగ్గిన కోడిగుడ్ల రేటు
TAGGED:Ethanol Usage IndiaNoidapetrolPM Narendra ModiUse of EthanolUttar Pradesh
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamabad Development Plans Nizamabad Development Plans | ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి: పీసీసీ చీఫ్​
Next Article Kavitha Party Name Controversy Kavitha Party Name Controversy | కవిత వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధుల ఆగ్రహం..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?