Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha Party Name Controversy | కవిత వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధుల ఆగ్రహం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kavitha Party Name Controversy | కవిత వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధుల ఆగ్రహం..

నిజామాబాద్

Kavitha Party Name Controversy | కవిత వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధుల ఆగ్రహం..

కొత్త పార్టీ తేదీని ప్రకటించే క్రమంలో ఎంపీ అర్వింద్​ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 2:55 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Kavitha Party Name Controversy

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kavitha Party Name Controversy | కొత్త పార్టీ తేదీని ప్రకటించే క్రమంలో ఎంపీ అర్వింద్​పై (MP Arvind) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శనివారం పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.

Contents
  • Kavitha Party Name Controversy | నిజామాబాద్​ వస్తేనే కోడలినని గుర్తొస్తుందా..?
    • Kavitha Party Name Controversy | మతిభ్రమించి మాట్లాడారు..
      • Kavitha Party Name Controversy | ఎంపీగా ఉండి కవిత ఏం చేశారు..

Kavitha Party Name Controversy | నిజామాబాద్​ వస్తేనే కోడలినని గుర్తొస్తుందా..?

ఎంపీ అర్వింద్​పై కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ డిప్యూటీ ఫ్లోర్​లీడర్ దంపల్లి జ్యోతి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ వచ్చి తాను తెలంగాణ (Telangana) ఆడబిడ్డను, నిజామాబాద్ కోడలిని అని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ఇందూరుకు వచ్చినప్పుడు, రాజకీయ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు తాను ఆడబిడ్డను, కోడలిని అన్న విషయం గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు.

Kavitha Party Name Controversy | మతిభ్రమించి మాట్లాడారు..

ఇందూరు జిల్లాలో (Induru District) ఎంపీ అర్వింద్​ ధర్మపురి ఏకంగా పది ఆర్వోబీలు, ఆర్​యూబీలు మంజూరు చేయించారని జ్యోతి గుర్తు చేశారు. వాటిలో ఇప్పటికే మూడు పూర్తి కాగా, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇటీవల ఎంపీ సెంట్రల్ రైల్వే మినిస్టర్​ను సైతం కలిసి ఇందల్వాయి, నవీపేట్ ఆర్​వోబీలు కూడా మంజూరు చేయాలని కోరారన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కవితకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెచ్చింది పార్లమెంట్ సభ్యులు అర్వింద్​ ధర్మపురి కాదా అని ఆమె ప్రశ్నించారు. పసుపు రైతుల సంక్షేమానికి ఆయన కట్టుబడి పనిచేస్తున్నారన్నారు.

Kavitha Party Name Controversy | ఎంపీగా ఉండి కవిత ఏం చేశారు..

కవిత నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని జ్యోతి డిమాండ్​ చేశారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించారా ? ఆర్​వోబీలు తెచ్చారా ? అభివృద్ధిని గాలికి వదిలేసి, లిక్కర్ స్కామ్‌లో వందలు, వేల కోట్లు కూడబెట్టింది వాస్తవం కాదా అని విమర్శించారు. మీ ఇంట్లోనే మీ తండ్రికి, మీ అన్నకు నీ మాటలంటేనే పట్టింపు లేదు, నువ్వు అర్వింద్​ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సీఎం రేవంత్ (CM Revanth) ఉద్దీన్ ఇచ్చిన పైసలు తీసుకొని కొత్త పార్టీ పెడతానని చెప్పులు అరిగేలా తిరుగుతున్నావని కవితను ఉద్దేశించి జ్యోతి వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 25న నువ్వు పెట్టబోయే కొత్త పార్టీకి “లిక్కర్ పార్టీ” అని పేరు పెట్టుకుంటే కరెక్టుగా సెట్ అవుతుందన్నారు. మీ తండ్రి సగం తెలంగాణను నాశనం చేస్తే, మిగిలిన తెలంగాణను కొత్త పార్టీ పేరుతో నువ్వు నాశనం చేయడానికి బయలుదేరావా అని విమర్శించారు. సమావేశంలో కార్పొరేటర్లు ఇప్పకాయల సుమిత్ర దేవి, చింత ప్రసున్నా రెడ్డి, కల్పె అర్చన, దాత్రికా రేవతి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Development Plans | ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి: పీసీసీ చీఫ్​

PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
Nizamabad Municipal Budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​ సమావేశం ప్రారంభం
Kamareddy Theft Arrest | పారిపోతున్న దొంగల పట్టివేత: క్రైంబీట్ సిబ్బందికి ఎస్పీ అభినందన
Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్​ సీజ్​
Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు
TAGGED:CM RevanthInduru DistrictKavitha Party Name ControversyMP ArvindTelangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ethanol Usage India Ethanol Usage India | ఇథనాల్​ వాడకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Next Article SSC Exams SSC Exams | నాల్గోరోజు ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?