Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Metro Takeover | హైదరాబాద్‌ మెట్రో స్వాధీనంపై అసెంబ్లీలో తీర్మానం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Metro Takeover | హైదరాబాద్‌ మెట్రో స్వాధీనంపై అసెంబ్లీలో తీర్మానం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Metro Takeover | హైదరాబాద్‌ మెట్రో స్వాధీనంపై అసెంబ్లీలో తీర్మానం

హైదరాబాద్‌ మెట్రోపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ కీలక ప్రకటన చేశారు. ఎల్​అండ్​టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకుంటున్నట్లు తీర్మానం ప్రవేశపెట్టారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 4:46 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
 Hyderabad Metro Takeover

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro Takeover | హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro)పై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ కీలక ప్రకటన చేశారు. ఎల్​అండ్​టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

Contents
  •  Hyderabad Metro Takeover | మెట్రోను విస్తరిస్తాం
    •  Hyderabad Metro Takeover | ఆర్టీసీకి రూ.7,800 కోట్లు

ఎల్​అండ్​టీ సంస్థ హైదరాబాద్​ మెట్రోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకుంటామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. మెట్రో రుణంతో పాటు కొంత మేర నగదు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన తీర్మానాన్ని సీఎం (CM Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిని తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే మెట్రో విస్తరణపై చర్చించకుండా తీర్మానాన్ని ఆమోదించడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​ రావు (Harish Rao) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయం అంటూ నిరసన తెలిపారు.

 Hyderabad Metro Takeover | మెట్రోను విస్తరిస్తాం

ప్రస్తుతం 69 కి.మీ. మెట్రో నిర్మాణం జరిగిందని సీఎం తెలిపారు. విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించామని చెప్పారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రెండో దశలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విస్తరణకు ఎల్​అండ్​టీ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకుంది.

 Hyderabad Metro Takeover | ఆర్టీసీకి రూ.7,800 కోట్లు

గత ప్రభుత్వం ఆర్టీసీనీ నిర్వీర్యం చేసే కుట్ర చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Minister Ponnam Prabhakar) అన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో 7 వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. తాము రెండేళ్లలోనే ఆర్టీసీకి రూ.7,800 కోట్లు చెల్లించామని తెలిపారు. మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme) ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ

Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​ బిల్లుల విడుదల
Sudarshana Chakra Story | సూర్య తేజస్సుతో పుట్టిన ఆయుధం.. సుదర్శన చక్రం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?
Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!
Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!
TAGGED:CM Revanth ReddyHarish RaoHyderabad Metro TakeoverMahalakshmi schemeMinister Ponnam PrabhakarTelangana assembly
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Olympiad Education Benefits Olympiad Education Benefits | విద్యార్థుల బంగారు భవితకు బాట.. ఒలంపియాడ్‌ విద్య..
Next Article Road Safety Awareness Road Safety Awareness | రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరికి అవగాహన ఉండాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?