Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Luxury Housing | ‘లగ్జరీ’ పెరిగింది.. విలాసవంతమైన ఇళ్లకు హైదరాబాద్‌లో డిమాండ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Luxury Housing | ‘లగ్జరీ’ పెరిగింది.. విలాసవంతమైన ఇళ్లకు హైదరాబాద్‌లో డిమాండ్

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Luxury Housing | ‘లగ్జరీ’ పెరిగింది.. విలాసవంతమైన ఇళ్లకు హైదరాబాద్‌లో డిమాండ్

హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 5:04 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
Hyderabad Luxury Housing

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hyderabad Luxury Housing | భారత్‌లో విలాసవంతమైన, ఖరీదైన ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఏటా లగ్జరీ హౌసింగ్ మార్కెట్ (Luxury Housing Market)  గణనీయంగా పెరుగుతూనే వస్తోంది. సంప్రదాయ మెట్రో కేంద్రాల నుంచి కొత్త భౌగోళిక ప్రాంతాలు, శివార్లకు లగ్జరీ గృహ మార్కెట్ విస్తరిస్తోంది. డెవలపర్లు పెద్ద లేఅవుట్లలో ప్రీమియం వసతులు, ఇంటిగ్రేటెడ్ లైఫ్‌స్టైల్ (Integrated Lifestyle) సౌకర్యాలతో ఇళ్లను నిర్మిస్తున్నారు.

Contents
  • Hyderabad Luxury Housing | టౌన్ షిప్ ల అభివృద్ధితో..
    • Hyderabad Luxury Housing | టాప్ -3లో హైదరాబాద్..
      • Hyderabad Luxury Housing | ఎందుకు డిమాండ్ అంటే..

అద్భుతమైన డిజైన్, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లను ఇవి ఆకర్షిస్తున్నాయి. డబ్బులకు కొదవలేనివారు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ మంది త్రీ బీహెచ్కే.. ఫోర్ బీహెచ్కే ఇళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత లగ్జరీ హౌసింగ్ మార్కెట్ గతేడాది 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. వచ్చే సంవత్సరంలో ఇది గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Hyderabad Luxury Housing | టౌన్ షిప్ ల అభివృద్ధితో..

ప్రధాన నగరాల్లో లగ్జరీ ప్రైజ్ ఇండెక్స్ (ఎల్‌పీఐ) 2021లో 2.32గా ఉండగా.. 2025 నాటికి 2.27కి తగ్గింది. ఇదే సమయంలో కొత్త ప్రాంతాలు, శివార్లలో ఎల్‌పీఐ 1 నుంచి 1.44కి పెరిగింది. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, పెద్ద ఎత్తున టౌన్ షిప్‌ల అభివృద్ధితో శివార్లలో లగ్జరీ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మధ్యస్థ లగ్జరీ గృహాల ధరలు ముంబయిలో అత్యధికంగా రూ. 9.66 కోట్లుగా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2.20 కోట్లు, చెన్నైలో రూ. 2 కోట్లుగా ఉన్నాయి.

Hyderabad Luxury Housing | టాప్ -3లో హైదరాబాద్..

అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఇళ్లకు సంబంధించిన అమ్మకాలు హైదరాబాద్‌ (Hyderabad) లో జోరుగా సాగుతున్నాయి. దీంతో దేశంలోని టాప్ -3లో నగరాల్లో హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. కొన్ని నివేదికల ప్రకారం లగ్జరీ ఇళ్ల అమ్మకాలలో భాగ్యనగరం మూడో స్థానంలో ఉండగా.. మరికొన్ని నివేదికల ప్రకారం రెండో స్థానంలో ఉంది. ఓ నివేదిక ప్రకారం 2025లో రూ. లక్ష కోట్ల విలువైన విక్రయాలతో లగ్జరీ ఇళ్ల అమ్మకాలలో హైదరాబాద్ దేశంలోనే ద్వితీయ స్థానంలో ఉండడం గమనార్హం. రూ. 1.83 లక్షల కోట్ల విలువైన లగ్జరీ ఇళ్ల అమ్మకాలతో దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలు అగ్ర స్థానంలో ఉన్నాయి. ఇందులో ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ మూడో స్థానంలో నిలిచింది. లగ్జరీ సెగ్మెంట్‌లో ధరలు 12 నుంచి 13 శాతం వరకు పెరిగినా అమ్మకాల్లో కూడా బలమైన వృద్ధి కనిపించడం గమనార్హం.

Hyderabad Luxury Housing | ఎందుకు డిమాండ్ అంటే..

హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్ల మార్కెట్ పెరగడానికి పలు కారణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఐటీ, ఫార్మా సెక్టార్‌ల వల్ల ఉన్నత ఆదాయం ఉన్నవారి సంఖ్య పెరగడంతో కొనుగోలు శక్తి పెరిగి విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో కోకాపేట్, నార్సింగి, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (Financial District) వంటి ప్రాంతాల్లో ప్రీమియం ప్రాజెక్టులు ఎక్కువ నిర్మిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Boyinapalli Market Issues | బోయిన్​పల్లి మార్కెట్​లో సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ ఈటల

 Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం
Watermelon Health Benefits | పుచ్చకాయను ఇష్టంగా తింటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా
Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు
TAGGED:Financial Districthousing demandHyderabad Luxury HousingHyderabad newsHyderabad real estateIntegrated Lifestyleinvestment propertiesluxury housingLuxury Housing Marketpremium homes Indiaproperty marketreal estate trends
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Road Safety Awareness Road Safety Awareness | రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరికి అవగాహన ఉండాలి
Next Article Egg Quality Check Egg Quality Check | గుడ్డును తూకం వేసి చూసిన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?