అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bab el Mandeb Strait | ఇరాన్‌పై గత నెల 28న ఇజ్రాయెల్ -అమెరికా సంయుక్తంగా చేసిన దాడులతో పశ్చిమాసియాలో మొదలైన ఉద్రిక్తతలు.. నెల గడిచినా తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పరిస్థితి క్షీణిస్తూనే ఉంది.
అమెరికా దాడుల నేపథ్యంలో ఆగ్రహానికి గురయిన టెహ్రాన్.. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 20 శాతం రవాణా జరిగే హర్మూజ్ జలసంధిలో రాకపోకలను అడ్డుకుంటోంది. దీంతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు గణనీయంగా పెరిగాయి. గ్యాస్ కొరత కూడా ఏర్పడుతోంది. భారత్, రష్యా, చైనా వంటి మిత్ర దేశాల నౌకల రవాణాకు అవకాశం కల్పిస్తున్నా.. పూర్తి స్థాయిలో క్రూడ్ ఆయిల్ రవాణా జరగడం లేదు. దీంతో ప్రపంచమంతా ఇబ్బంది పడుతోంది.
Bab el Mandeb Strait | మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తున్న టెహ్రాన్..
హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఇరాన్ దీవులలో సైన్యాలను మోహరిస్తోంది. మరోవైపు ఇజ్రాయిల్ దాడులు (Israeli Attacks) పెరుగుతుండడంతో ఇరాన్ మరో కొత్త అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సహా దాని మిత్రదేశాలు తమపై ఒత్తిడిని పెంచితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్న ఇరాన్.. బాబ్ అల్ మాండెబ్ జలసంధిని దిగ్బంధించి, ఊహించని యుద్ధ క్షేత్రాలను తెరుస్తామని హెచ్చరించింది.
Bab el Mandeb Strait | బాబ్ అల్ మాండెబ్ ఎక్కడుందంటే?
హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రం, సూయజ్ కాలువతో కలిపే ఒక ప్రధాన జలమార్గం బాబ్ అల్ మాండెబ్. అరబిక్‌లో దీని అర్థం ‘కన్నీటి ద్వారం’ ఇది ఒక ప్రమాదకరమైన జల మార్గం కావడంతో దానికి ఆ పేరు వచ్చింది. సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రంలోకి ప్రవేశించే నౌకలు హిందూ మహాసముద్రంలోకి వెళ్లేందుకు ఈ జలసంధిని ఉపయోగిస్తాయి. అమెరికా, ఐరోపా, భారత్, చైనాలకు నౌకలు ఈ మార్గం గుండానే సాగుతాయి.
Bab el Mandeb Strait | రూ. 93 లక్షల కోట్ల సరుకుల రవాణా..
ప్రధానంగా గల్ఫ్ నుంచి యూరప్, అమెరికాలకు చమురు, సహజ వాయువు రవాణాలో ఇది ఒక కీలక మార్గం. రోజూ 45 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ దీని గుండా ఆయా దేశాలకు వెళుతుంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 12 శాతం, ఎలఎన్జీలో 8 శాతం బాబ్ అల్ మాండెబ్ జలసంధి ద్వారానే సాగుతోంది. వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలోనే రవాణా అవుతున్నాయి. ఏటా రూ.93.95 లక్షల కోట్ల విలువైన సరకులు ఈ జలసంధి మీదుగానే రవాణా అవుతున్నట్లు అంచనా. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద జల మార్గమైన దీనిని మూసేస్తే సూయజ్ కాలువ నుంచి ప్రయాణించే నౌకలు హిందూ మహాసముద్రంలోకి చేరలేవు. సముద్ర మార్గంలో జరిగే సరుకు రవాణాకు ముఖ్యంగా క్రూడాయిల్ రవాణా నిలిచిపోతుంది. ఇప్పటికే హర్మూజ్‌ను ఇరాన్ నియంత్రించడంతో చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం తీవ్రంగా ఉంది. బాబ్ అల్ మాండెబ్ మూతపడితే ప్రపంచం మరింత ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.
ఇది కూడా చదవండి..: Visakhapatnam Oil LPG Ships | హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. విశాఖకు వరుసగా చేరుతున్న చమురు, LPG నౌకలు

