అక్షరటుడే, ఆర్మూర్ : Road Safety Awareness | రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరికి అవగాహన ఉండాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి (ACP Venkateshwar Reddy) అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఉజ్వల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలూరు మండలంలోని మచ్చర్ల నుంచి దేగాం, మిర్ధపల్లి గ్రామాల మధ్య అడవి దూదికాయలు తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
Road Safety Awareness | వేసవిలో ఎండిన అడవి దూది కాయల కారణంగా..
ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మచ్చర్ల నుంచి దేగాం, మిర్ధపల్లి గ్రామాల (Mirdhapalli villages) మీదుగా ఆర్మూర్ (Armoor)కు వెళ్లే వారికి రహదారులపై ఎండిపోయిన అడవి దూదికాయల నుంచి వచ్చే దూది కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ దూది అకస్మాత్తుగా కళ్లలో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాగే శ్వాసకోశ సమస్యలకు కూడా కారణమవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం, రోడ్డు భద్రత వారోత్సవాల నేపథ్యంలో ఇలాంటి ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఉజ్వల ట్రస్ట్ అధ్యక్షుడు మిన్ని శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. అడవి దూది చెట్ల వల్ల వాహనదారులకు ప్రమాదం కలగవచ్చని గుర్తించి, దూది గింజలు, కాయలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ గౌడ్, దేగాం శ్రీకాంత్ గౌడ్, సురేష్, రాము, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad corporation budget | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌కు ఆమోదం

