అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyundai Venue Price Hike | ఆటో మొబైల్ రంగ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV) అయిన వెన్యూ మోడళ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది పెట్రోల్, డీజిల్ మోడళ్లకు వర్తిస్తుంది. ధరలు రూ. 5 వేల నుంచి రూ. 20 వేల వరకు పెరిగాయి. దీంతో వెన్యూ మోడల్ కార్ల ఎక్స్ షోరూమ్ ధరల శ్రేణి రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.51 లక్షల మధ్య ఉంది. ఎక్స్ షోరూమ్, ఆన్ రోడ్ ధరలు పన్నులు, బీమా కారణంగా నగరాన్ని బట్టి మారుతుంటాయి.
Hyundai Venue Price Hike | పెట్రోల్ వేరియంట్స్‌లో..
హ్యుందాయ్ కంపెనీ అత్యధికంగా 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ ఇంజన్ ఎంపికలో లభించే హెచఎక్స5 ట్రిమ్ వేరియంట్ ధరను రూ. 20 వేల వరకు పెంచింది. దీంతో ఈ వేరియంట్ ధర రూ. 9.55 లక్షలకు చేరింది. బేస్ మోడల్ ధర రూ. 8 లక్షల వద్ద ఉంది. కాగా హెచఎక్స5 ప్లస్, హెచఎక్స6టీ వంటి వేరియంట్స్ ధరలను పెంచలేదు.1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ డీసీటీ వేరియంట్స్ ధరలూ స్వల్పంగా పెరిగాయి. హెచఎక్స5 డీసీటీ ధర రూ. 9 వేలు పెరిగి రూ. 10.90 లక్షలకు చేరింది.హెచఎక్స6 డీసీటీ ధర కూడా రూ. 9 వేలు పెరిగి రూ. 12.16 లక్షలకు, హెచఎక్స8 డీసీటీ ధర రూ. 5వేలు పెరిగి రూ. 12.99 లక్షలకు చేరాయి. బేస్ మోడల్ హెచఎక్స2 టర్బో ధర రూ. 8.89 లక్షల వద్ద ఉంది. ఎన్ లైన్ వేరియంట్ ధరల్లో మార్పు లేదు.
Hyundai Venue Price Hike | డీజిల్ వేరియంట్స్‌లో..
1.5 లీటర్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 8 వేలు పెరిగాయి. దీంతో హెచఎక్స2 ధర రూ. 9.87 లక్షలు, హెచఎక్స5 రూ. 10.87 లక్షలు, హెచఎక్స5 ఏటీ రూ. 11.81 లక్షలు, హెచఎక్స7 రూ. 12.69 లక్షలకు చేరాయి. టాప్ ఎండ్ హెచఎక్స8 ఏటీ ధర రూ. 13.69 లక్షలు, హెచఎక్స10 ఏటీ ధర రూ. 15.51 లక్షలుగా ఉంది.
ఇది కూడా చదవండి..: Gold Silver Rates | అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం.. స్థిరంగా బంగారం ధరలు, భారీగా పడిపోయిన వెండి ధరలు
