అక్షరటుడే, ఎల్లారెడ్డి : Egg Quality Check | సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, హాస్టళ్లకు సరఫరా చేసే గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. ఈ మేరకు మద్నూర్లోని (Madnur) సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Egg Quality Check | ఆహార పదార్థాల నాణ్యత తనిఖీ..
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ముఖ్యంగా గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వయంగా ఆయన గుడ్లను తూకం వేసి వాటి బరువును పరిశీలించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా గుడ్ల బరువు ఉందో లేదో నిత్యం తనిఖీలు చేయాలని.. తక్కువ బరువుతో సరఫరా అవుతుంటే వెంటనే సంబంధిత ఏజెన్సీని అలర్ట్ చేయాలని పేర్కొన్నారు. సరఫరాలో నాణ్యత లోపాలు ఉంటే గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Egg Quality Check | విద్యార్థులతో కలిసి భోజనం..
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ వారికి అందుతున్న ఆహారం, వసతులపై ప్రత్యక్షంగా కలెక్టర్ తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, విద్యార్థులకు పోషకాహారం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్కూల్లో శుభ్రత, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీఈవో రాజు (DEO Raju), డీఎస్వో రామ్మోహన్, సంబంధిత అధికారులున్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్పాల్

