అక్షరటుడే, కామారెడ్డి: Lok Adalat cases settlement | జాతీయ లోక్ అదాలత్‌లో శనివారం భారీగా(Kamareddy news) కేసులు పరిష్కారామయ్యాయి. బాధితులకు కూడా భారీగానే పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. శనివారం జిల్లాలోని పలు కేసుల పరిష్కారం కోసం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్(Lok Adalat) నిర్వహించారు.
Lok Adalat cases settlement | 8 బెంచ్‌ల ఏర్పాటు..
కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఎనిమిది బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 4,506 కేసులు పరిష్కారం(dispute resolution) కాగా బాధితులకు రూ.1,95,97,781 అందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో అత్యధిక సంఖ్యలో 4,391 కేసులు రాజీ (compensation cases) కుదిర్చారు. వీటి ద్వారా రూ.73,83,390 బాధితులకు(Telangana judiciary) అందేలా చేశారు. 24 సివిల్ కేసులను పరిష్కరించారు. ప్రమాదం జరిగిన 11 కేసుల పరిష్కారం చేసి బాధితులకు రూ.కోటి 5 వేలు, 63 సైబర్ క్రైం కేసుల పరిష్కారం(case settlement) ద్వారా రూ.12,44,391, 17 వివాదాల కేసుల పరిష్కారం(legal services) ద్వారా రూ.9.65 లక్షలు బాధితులకు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్, వివిధ బెంచ్‌ల న్యాయమూర్తులు, జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేష్ చంద్ర, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Egg Quality Check | గుడ్డును తూకం వేసి చూసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..

