అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran US Tensions | మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అమెరికా తన సైన్యాన్ని భారీగా తరలిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇరాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ Tehran Times సంచలన కథనాన్ని ప్రచురించింది. “నరకానికి స్వాగతం” అనే తీవ్రమైన హెడ్‌లైన్‌తో ప్రచురించిన ఈ తాజా కథనం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
Iran US Tensions | సైనిక దళాల మోహరింపు
తొలి విడతగా United States ఇప్పటికే సుమారు 3,500 మంది సైనికులను మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చేరవేసింది. అదనంగా మరో 10,000 మంది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రాంతీయ భద్రత కోసమే ఈ చర్యలు అని అమెరికా వర్గాలు చెబుతున్నప్పటికీ.. పరిస్థితి భీకర యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.
Iran US Tensions | ఇరాన్ ఘాటైన హెచ్చరిక
అమెరికా చర్యలపై Iran మీడియా కఠిన భాషలో స్పందించింది. “ఇరాన్ భూభాగంపై అడుగుపెట్టే ప్రతి యూఎస్ సైనికుడు శవపేటికలోనే తిరిగి స్వదేశానికి వెళ్తాడు” అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. తాజా వ్యాఖ్యలు మరింత తీవ్రతరం చేసేలా కనిపిస్తున్నాయి.
ప్రాంతీయ పరిస్థితులు ఆందోళనకరం
ఇప్పటికే రాజకీయ, సైనిక పరమైన ఉద్రిక్తతలతో మిడిల్ ఈస్ట్ ప్రాంతం కుదేలవుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా తన సైనికుల మోహరింపు, ఇరాన్ నుంచి వచ్చిన తీవ్ర హెచ్చరికలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.
యుద్ధ పరిణామాలు..?
నిపుణుల అంచనా ప్రకారం.. ఈ పరిణామాలు యుద్ధానికి దారితీసే ప్రమాదాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని చెబుతున్నారు. కాగా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు డిప్లొమాటిక్ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు మాత్రం పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Bab el Mandeb Strait | ఆ జలసంధిని మూసేస్తే.. ప్రపంచానికి ‘కన్నీటి ద్వారమే’నా!?

