అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dhurandhar 2 collections | ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar 2) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నార్త్ అమెరికా మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిన బాహుబలి 2: ది కన్క్లూజన్ రికార్డును ఈ చిత్రం అధిగమించింది. దాదాపు తొమ్మిదేళ్లుగా నిలిచిన ఈ రికార్డు ఇప్పుడు బ్రేక్ కావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘ధురంధర్: ది రివెంజ్’ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమా చూసి చాలా ఆనందించానని, ఈ స్థాయిలో రికార్డులు బద్దలవుతుండడం చూడటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్ మొత్తం ఈ విజయానికి అర్హులేనని ఆయన అభినందించారు.
Dhurandhar 2 collections | కలెక్షన్ల వర్షం..
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా (Ranveer Singh), దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, రోజురోజుకూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది. ముఖ్యంగా సెలవుల సీజన్ కాకపోయినా ఈ స్థాయి కలెక్షన్లు రావడం విశేషంగా మారింది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడి వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
‘ధురంధర్: ది రివెంజ్’ ప్రస్తుతం చూపిస్తున్న దూకుడు చూస్తుంటే, భవిష్యత్తులో మరిన్ని భారీ రికార్డులను కూడా ఈ చిత్రం తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ రికార్డును భవిష్యత్తులో ఎవరు అధిగమిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ మొదటి పార్ట్ First Part కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక అభిమానులు ఇప్పుడు మూడో పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి : Dhurandhar 2 Collections | వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ధురంధర్ 2.. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్లబ్‌లోకి చేరిన టాప్ 10 చిత్రాలివే..!
