Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Pista House biryani issue | పిస్తాహౌస్ బిర్యానీలో ఈగలు, బొద్దింకలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Pista House biryani issue | పిస్తాహౌస్ బిర్యానీలో ఈగలు, బొద్దింకలు

హైదరాబాద్

Pista House biryani issue | పిస్తాహౌస్ బిర్యానీలో ఈగలు, బొద్దింకలు

పిస్తాహౌజ్​ బిర్యానీలో ఈగలు, బొద్దింకలు రావడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ ఎదుట ఆందోళన చేపట్టారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 11:06 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Pista House biryani issue

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pista House biryani issue | హైదరాబాద్ (Hyderabad)​ బిర్యానీ అంటే చాలా మంది లొట్టలేసుకుంటూ తింటారు. దీంతో నగరంలో అనేక హోటళ్లలో బిర్యానీ దొరుకుతుంది. అయితే పలు హోటళ్లలో బిర్యానీ బాగుంటుందనే టాక్​ ఉంది. అలాగే పిస్తాహౌస్​ బిర్యానీకి సైతం మంచి పేరుంది. ఈ క్రమంలో ఆ హోటల్​లో బిర్యానీ తినడానికి వెళ్లిన కస్టమర్లకు షాకింగ్​ ఘటన ఎదురైంది. బిర్యానీలో ఈగలు, బొద్దింక రావడంతో వారు షాక్​ అయ్యారు.

Contents
  • Pista House biryani issue | రెస్టారెంట్​ ఎదుట ఆందోళన
    • Pista House biryani issue | బయట తినాలంటే భయం

మల్కాజ్​గిరి మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని పెద్ద అంబర్​పేట (Pedda Ambarpet)లో గల ‘పిస్తా హౌజ్​ రెస్టారెంట్​ మండీ’లో వడ్డించిన బిర్యానీతో పాటు ఇచ్చిన సాలన్‌లో బొద్దింక, ఈగలు వచ్చాయి కుంట్లూరుకు చెందిన పలువురు రెస్టారెంట్​లో బిర్యానీ తినడానికి వెళ్లారు. అయితే సాలన్​లో బొద్దింక, ఈగ, దోమలు కనిపించాయి. దీంతో వారు యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pista House biryani issue | రెస్టారెంట్​ ఎదుట ఆందోళన

సిబ్బంది తీరును నిరసిస్తూ బాధితులు రెస్టారెంట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటనపై అధికారులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు. చాలా మందికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో బిర్యానీని వదిలేసి వెళ్లారన్నారు. పరిశుభ్రత పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

Pista House biryani issue | బయట తినాలంటే భయం

హైదరాబాద్​ నగరంలో బయట ఏదన్న తినాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల టాస్క్​ఫోర్స్​ (Taskforce) అధికారుల దాడుల్లో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాల నుంచి మొదలు పెడితే అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు. వాటిపై పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా నిబంధనలు పాటించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లపై సైతం దాడులు చేయాలని కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : Illegal Bakery | అక్రమంగా నిర్వహిస్తున్న బేకరీపై పోలీసుల దాడి

Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
Hyderabad Bomb Threat | హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు
Gas Cylinder Black Market | బ్లాక్​లో సిలిండర్ల విక్రయం.. 10 మంది అరెస్ట్
BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం
Hyderabad Traffic Relief | ట్రాఫిక్​ రద్దీ నివారణకు చర్యలు : సీపీ సజ్జనార్​
TAGGED:biryani controversyHyderabad food safetyPista Houserestaurant hygiene issue
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mission Bhagiratha Water Supply | Mission Bhagiratha Water Supply | ఐదురోజుల పాటు మిషన్​ భగీరథ నీటిసరఫరా నిలిపివేత
Next Article duster తెలంగాణలో సరికొత్త రెనాల్ట్ డస్టర్‌ను విడుదల చేసిన పీపీఎస్ మోటార్స్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?